BREAKING
వాంకిడికలాన్ పాఠశాలలో ఘనంగా ఫ్లాగ్ డే వేడుకలు కావలి డిపోలో ఘనంగా ముగిసిన బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు – డీఎం. డి. ఆదినారాయణ టీఎస్‌యూటీఎఫ్‌ పెంచికల్‌పేట్‌ మండల నూతన కార్యవర్గం ఎన్నిక సరోజినీ దేవికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి. మంత్రి నారాయణకు కృతజ్ఞతల వెల్లువ పాము కాటుకు గురైన మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెండింగ్ దరఖాస్తులు, ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలి - జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం దివ్యాంగుల సాధికారత కృషికి రాష్ట్ర స్థాయి పురస్కారాల కొరకు దరఖాస్తుల స్వీకరణ పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి రామకృష్ణ పారిశుద్ది కార్మిలకులకు చీరల పంపిణి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై జలసిరి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీఓ.. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా దీపావళి వేడుకలు దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు

స్ఫూర్తిదాయక నినాదం వందేమాతరం

Select Suryaa Now
స్ఫూర్తిదాయక నినాదం వందేమాతరం

సూర్య : స్ఫూర్తిదాయక నినాదం వందేమాతరం  అని  జనవిజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ ఎం వి ఆర్ కృష్ణాజి పేర్కొన్నారు. వందేమాతరం దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ  పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణాజీ మాట్లాడుతూ 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాతరం గేయాన్ని ఆలపించారు అని అన్నారు. గురు ప్రసాద్ మాట్లాడుతూ వందేమాతరం కేవలం ఒక గేయం మాత్రమే కాదని భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తికి, దేశభక్తికి ప్రతీకగా నిలిచింది అని మాతృభూమిపై అపారమైన ప్రేమకు, దేశభక్తికి, జాతీయ సమైక్యతకు నిలువెత్తు ప్రతీక వందేమాతరం అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కరస్పాండెంట్ ఏం స్వరూప ,ప్రధాన ఉపాధ్యాయులు పూడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.