BREAKING
కోగిలిలో టీడీపీ అభ్యర్థి కమతం చెంగయ్య ఘన విజయం 454 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల సంబరాలు ఆధార్ సెంటర్ కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అద్దంకి జెడ్పీటీసీ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ. 7,650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన మానం మురళీమోహన్ దాస్. బీఆర్ఎస్ పాపానికే మేడిగడ్డ కూలింది తెలంగాణ రాష్ట్ర మరియు ఖేడ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎన్నాళ్లీ ప్రమాదాల పరంపర.. చెరువు అన్నారం స్టేజ్‌ వద్ద సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయరా? కూటమి శ్రేణులతో విజయోత్సాహాన్ని పంచుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం గుడిపల్లిలో టీడీపీ విజయదుందుభి రష్యాలో జపాన్ టొబాకో ఆస్తులను స్వాధీనం చేసుకున్న పుతిన్ బెర్క్‌షైర్ హాత్వే త్రైమాసిక లాభాల్లో క్షీణత...భారీగా పెరిగిన షేర్ల బైబ్యాక్ కొనుగోళ్లు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల రేసులో మెలంచన్ సంచలన హామీలు ఆమదాలవలస మండలం కూటమి కైవసం * ఒకే ఒక్క స్థానంలో వైసిపి గెలుపు * గాజాలో భారీ వర్షాలు, వరదలతో వణికిపోతున్న శరణార్థులు

కావలి డిపోలో ఘనంగా ముగిసిన బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు – డీఎం. డి. ఆదినారాయణ

Select Suryaa Now
కావలి డిపోలో ఘనంగా ముగిసిన బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు –  డీఎం.  డి. ఆదినారాయణ

కావలి, మేజర్ న్యూస్ :   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, కావలి డిపోలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు -2026 ముగింపు ఏడవ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం డిపో గ్యారేజ్ ప్రాంగణంలో వ్యర్థాల తగ్గింపు – వ్యర్థాల నిర్వహణ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా డిపో మేనేజర్ డి. ఆదినారాయణ మాట్లాడుతూ, నిత్య జీవితంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో సేకరించడం, తడి – పొడి వ్యర్థాలుగా వేరు చేయడం, సరైన విధంగా పారవేయడం, పునర్వినియోగం చేయడం వంటి చర్యలే సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణకు కీలకమని వివరించారు.
వ్యర్థాలను ప్రధానంగా మూడు రకాలుగా విభజించి నిర్వహించాలని సూచించారు. తడి వ్యర్థాల కింద వ్యర్థమైన గ్రీజు, ఆయిల్స్ తదితరాలను, పొడి వ్యర్థాల కింద కాగితాలు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్, గాజు, లోహపు వస్తువులను గుర్తించి, వాటిని సంబంధిత రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించాలని తెలిపారు.  అదేవిధంగా బ్యాటరీలు, కాలిపోయిన ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు, చోక్స్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, రసాయన పదార్థాలు వంటి ప్రమాదకర వ్యర్థాలను సాధారణ చెత్తతో కలపకుండా ప్రత్యేక జాగ్రత్తలతో, నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించారు.  వ్యర్థాల నిర్వహణలో తగ్గించడం (రెడ్యూస్ ), తిరిగి వినియోగించడం (రీయూజ్ ), పునర్వినియోగ ప్రక్రియ (రీసైకిల్ ), సేంద్రీయ ఎరువుల తయారీ (కంపోస్టింగ్ ) అనే నాలుగు సూత్రాలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వ్యర్థాలను ఉత్పత్తి అయిన చోటనే వేరు చేయడం  ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.  అనంతరం వారం రోజులపాటు నిర్వహించిన బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలను విజయవంతం చేసిన డిపో సిబ్బంది అందరికీ డిపో మేనేజర్ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం ముగింపులో సిబ్బంది పర్యావరణ హితమైన జీవనశైలిని అవలంబిస్తూ, వ్యర్థాల తగ్గింపు మరియు సమర్థవంతమైన నిర్వహణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.  దీంతో కావలి డిపోలో వారం రోజులపాటు ఉత్సాహంగా నిర్వహించిన బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు - 2026  ఘనంగా ముగిశాయి.  ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ ఇంజనీర్ ( మెకానికల్ ) యస్కె ఖాజా మొహిద్దీన్, మెకానికల్ సూపెర్వైజర్ నజీర్ ఖాన్, బస్టేషన్ సూపెర్వైజర్ డి రవిప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు.