BREAKING
పాము కాటుకు గురైన మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెండింగ్ దరఖాస్తులు, ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలి - జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం దివ్యాంగుల సాధికారత కృషికి రాష్ట్ర స్థాయి పురస్కారాల కొరకు దరఖాస్తుల స్వీకరణ పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి రామకృష్ణ పారిశుద్ది కార్మిలకులకు చీరల పంపిణి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై జలసిరి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీఓ.. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా దీపావళి వేడుకలు దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు చరిత్ర సృష్టించిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ: టీ20 క్రికెట్‌లో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ వీడియో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షణ.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహీద్ హృదోయ్: టెస్టుల్లో సరికొత్త ఆల్-టైమ్ రికార్డు నమోదు

నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు! కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే! కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ

Select Suryaa Now
నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు!  కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే!  కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ

నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు!

కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే!

కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ?

నేరేడుచర్ల మేజర్ న్యూస్

నేరేడుచర్లలో బియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. పట్టణంలో బియ్యం విక్రయాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రకాన్ని బట్టి కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయిస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరువు పరిస్థితులతో ఉపాధి కరువై అల్లాడుతున్న ప్రజలకు బియ్యం ధరలు మరింత భారంగా మారాయి.

కరువు ఒకవైపు.. ధరల మోత మరోవైపు!

సరైన వర్షాలు లేకపోవడం, నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో కుడికాలువకు సాగునీటి విడుదల నిలిచిపోయింది. ఫలితంగా ఆయకట్టు రైతులు సాగు సమస్యలను ఎదుర్కొంటున్నారు. బోర్లలోనూ నీరు తగ్గడంతో వ్యవసాయ పనులు మందగించాయి. కూలీలకు పనులు దొరకని పరిస్థితుల్లో నిత్యావసర ధరలు పెరగడం పేద కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోంది.

వ్యాపారులదే ధరల రాజ్యమా?

నేరేడుచర్లలో బియ్యం దుకాణాల్లో విక్రయ ధరలపై నియంత్రణ కొరవడిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. క్వింటా బియ్యం రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు పలుకుతుండగా, కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. దుకాణాల వారీగా ధరల్లో తేడాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల చర్యలేవీ?

అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా, నేరేడుచర్లలో పరిస్థితి మాత్రం మారడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? వ్యాపారుల విక్రయ ధరలను పర్యవేక్షించే బాధ్యత అధికారులకు లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికైనా అధికారులు మేల్కొంటారా?

పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారులు వెంటనే స్పందించి బియ్యం దుకాణాలు, రైస్ మిల్లులు, గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిల్వలు, బిల్లులు, విక్రయ ధరలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తక్కువ ధరకు బియ్యం అందించే ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన అధికారులు ప్రకటనలకే పరిమితమైతే సామాన్యుడి కంచంలో అన్నం కూడా భారంగా మారే పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో స్పందిస్తారా? లేక బియ్యం ధరల భారాన్ని ప్రజలే భరించాలా?