వ్యూహం ఫలించింది...ఆశించిన ఎంపీపీ పీఠం దక్కింది!
గరుగుబిల్లి, సూర్య : కోరుకున్న లక్ష్యం మేరకు కన్వీనర్ కష్టానికి ప్రతిఫలం దక్కింది.. ఎంపీటీసీల గెలుపుతో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్నారు!రాజకీయాల్లో వ్యూహం,పట్టుదల కార్యకర్తలను నడిపించే నాయకత్వ లక్షణాలు ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదని మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మరడాన నారాయణ స్వామి నిరూపించారు.స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో మండల తెలుగు దేశం పార్టీ కన్వీనర్ మరడాన నారాయణస్వామి అనుసరించిన పక్కా వ్యూహం అద్భుత ఫలితాన్ని ఇచ్చింది.క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్ ముగిసే వరకు ప్రతి అడుగూ ఆచి తూచి వేసిన మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మరడాన నారాయణ స్వామి తాను పట్టు బట్టి అనుకున్న 'ఎంపీపీ' స్థానాన్ని అధికారికంగా సాధిం చుకుని పార్టీ అధిష్ఠానం దృష్టిలో శెభాష్ అనిపించుకున్నారు.స్థానిక రాజకీయా ల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంపీపీ పదవిని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని మండల కన్వీనర్ మరడాన నారాయణస్వామి పట్టుదల తో ఉన్నారు.ఇందుకు మండలంలోని అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలవ డం తప్పనిసరి.ప్రతిపక్షాల నుంచి పోటీ ఉన్నప్పటికీ, ప్రతి గ్రామంలోనూ బల మైన, ప్రజాదరణ ఉన్న అభ్యర్థులను రంగంలోకి దించడంలో కన్వీనర్ విజయవంతమయ్యారు.ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి మండల టీడీపీ కన్వీనర్ మరడాన నారాయణస్వామి ప్రతి గ్రామంలోనూ స్వయంగా పర్యటించారు.పార్టీని గెలిపిస్తే తనకు గుర్తింపు వస్తుందని నమ్మిన మండల టిడిపి కన్వీనర్ మరడాన నారాయణస్వామి ఎంపిటిసి అభ్యర్థుల గెలుపును ప్రతిష్టగా తీసు కున్నారు.మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలకుగాను 10 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకోవడంతో తాను ఆశించిన ఎంపీపీ పీఠంపై కూర్చోవడానికి మార్గం సుగమం చేసుకున్నారు.అధిష్టానం నమ్మకాన్ని నిలబెడుతూ మండలంలో పట్టు సాధించడమే కాకుండా అను కున్న ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్న మండల టిడిపి కన్వీనర్ మరడాన నారాయణస్వామిపై పార్టీ శ్రేణులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సమిష్టిగా పనిచేస్తే విజయం ఎలా వరిస్తుందో ఈఫలితమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.