BREAKING
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగూరు నారాయణ హెచ్‌ఐవి /ఎయిడ్స్ సమీక్ష సమావేశం ఫార్మా డి, లా పరీక్ష ఫలితాలు విడుదల కూటమి తరపున తల్లి, కూతుర్లు విజయం ఎయిమ్స్‌(ఇనిసెట్‌) పీజీ ప్రవేశ పరీక్షల్లో శ్రీప్రజ్ఞ ప్రతిభ ఓయన్ కొత్తూరులో టీడీపీ విజయకేతనం ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం మేకపాటి కోటలో ఎగిరిన పసుపు జెండా ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు టీడీపీ కైవసం వైభవంగా పైడితల్లి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు వెల్దుర్తి జడ్పిటిసి తెదేపా అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు ఘనవిజయం రామభద్రపురం మండలం తెలుగుదేశం పార్టీ హవా ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా వాసులకు బంగారు, వెండి పథకాలు నాకాఫ్ టెండర్‌ను రద్దు చేయాలి- ఐక్య విద్యార్థి సంఘాలు

అభివృద్ధి,సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారు....ఎంఎల్ఏ " కోండ్రు "

Select Suryaa Now
అభివృద్ధి,సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారు....ఎంఎల్ఏ " కోండ్రు "

రాజాం, సూర్య : స్థానిక ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సాధించిన విజయంపై రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాజాం మండలం శ్యాంపురంలోని తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. వీరికి ఎమ్మెల్యే దుస్సలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు అందించిన తీర్పు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల వారికున్న ఆదరణకు నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాయని తెలిపారు. ప్రజల మద్దతుతో లభించిన ఈ విజయాన్ని మరింత బాధ్యతగా స్వీకరించాలని అభ్యర్థులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి రహదారులు, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి,సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా కృషిచేస్తున్నామని, ఈ కృషికి ప్రజల నుంచి లభించిన ఆదరణ స్థానిక ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన కూటమి అభ్యర్థులు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి అభివృద్ధి పనుల రూపంలో ప్రతిఫలం అందిస్తామని, ప్రతి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. 
కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, నియోజక వర్గం ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.