telangana
అచీవర్స్ పాఠశాలలో ఘనంగా కాలుష్య రహిత దీపావళి వేడుకలు
సూర్య కరీంనగర్ : స్థానిక కోతిరాంపూర్ లోని అచీవర్స్ యాక్టివ్ పాఠశాలలో దీపావళి పండుగని పురస్కరించుకొని దీపావళి వేడుకలను చాల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రిన్సిపాల్ సి.హెచ్. పల్లవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.అనంతరం విద్యార్థిని విద్యార్థులు దీపావళి పండుగ యొక్క విశిష్టతను తమ నృత్యాలు మరియు రామాయణ నాటకాల ద్వారా వివరించారు.అనంతరం పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి కి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు .అందులో ఆనంద ఉత్సాహాలతో అందరు జరుపుకొనే పండుగే దివ్య దీప్తుల, జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి ఈ దీపావళి పండుగ అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ సి.హెచ్ పల్లవి, విద్యార్థిని విద్యార్థులు, పాఠశాల సిబ్బంది,అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.