సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ముగింపు సందర్భంగా ర్యాలీ
గరుగుబిల్లి, సూర్య : ప్రకృతిని కాపాడుకుంటూ, వనరులను వృధా చేయకుండా జీవించడమే సుస్థిర జీవనశైలి. ప్రస్తుత ప్రపంచంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న నేపథ్యంలో, రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించడానికి మనం మన అలవాట్లను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మండల వెలుగు ఏపీఎం పెదిరెడ్ల అప్పలనాయుడు పేర్కొన్నారు. "సుస్థిర జీవనశైలి వారోత్సవాల"ముగింపు సందర్భంగా శనివారం మండల కేంద్రంలో వెలుగు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యక్రమం యొక్క ఆవశ్యకతను తెలియజేసేందుకు వెలుగు కార్యాలయం నుంచి ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేశారు.అనంతరం జరిగిన సమావేశంలో మండల వెలుగు ఏపిఎం పెదిరెడ్ల అప్పలనాయుడు మాట్లాడుతూ సుస్థిర జీవన శైలి వారోత్సవాలు సందర్భముగా పలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు.భూమిపై ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి, సహజ వనరులైన నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుతూ, ప్రకృతికి హాని చేయని జీవన విధానాన్ని అలవర్చుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆర్పేయడం,నీటిని వృధా చేయకుండా చూసుకోవాలన్నారు.ఈకార్యక్రమంలోవెలుగు సిసిలు చందాన తిరుపతిరావు,వడిశాపు లక్ష్మణరావు, కార్యాలయ సిబ్బంది ఉడమల శాంతికుమారి(శాంతి), కొప్పర రమేష్,వివోఏలు వావిలిపల్లి స్వాతి, ఇజ్జురోతు గౌరీ,గొట్టాపు జ్యోతి, బొబ్బిలి జ్యోతి, గొట్టాపు సుజాత, గంట శ్రీదేవి, చింత ఉషారాణి, బలగ మంగమ్మ, గులిపల్లి అనురాధ, గంట క్రాంతికుమారి, పెనుగంటి తులసి, వెలగాడ శ్రీదేవి, గుంట కల్పన, నెల్లి లీలాకుమారి, అల్లు ఉషారాణి, నూలు తనూజ,బేత సరస్వతి, గంట యశోద, అల్లు యశోద, ఓలేటి పావని, కైంకర్యం కిరణ్మయి, బొంతాడ పద్మ, బడే సుధారాణి ,పిల్లి విజయ, మండల కళ్యాణి ,బంటు రాజేశ్వరి, బోను విజయలక్ష్మి, మంత్రబుడ్డి సుజాత, బొబ్బిలి సుశీల,డోళ్ళు మానస, ఏగిరెడ్డి భవాని, బలగ పద్మ, దాసరి సీతారాం, జామి సువర్ణ, చదురు వరలక్ష్మి, మరిశర్ల స్వాతి, గుల్ల రాజేశ్వరి, గంట జయమ్మ తదితరులు పాల్గొన్నారు.