telangana
వికసిత్ భారత్ @ 2047లో యువ సంవాద్ .
సూర్య రామడుగు : బీజేవైఎం రామడుగు మండల శాఖ అధ్యక్షులు దయ్యాల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రామడుగు మండలంలోని గోపాల్రావుపేటలోని ఆల్ఫోర్స్ కళాశాలలో వికసిత్ భారత్ @ 2047 – యువ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సంగ నరేష్ బీజేపీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సంగ నరేష్ విద్యార్థులతో మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం, వారి ఆలోచనలు, నైపుణ్యాలు, బాధ్యతలపై విద్యార్థులతో చర్చించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని లక్ష్యసాధన దిశగా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పోచంపల్లి నరేష్, బీజేవైఎం నాయకులు బందారి శ్రీనివాస్, వేముండ్ల కుమార్, ఎడవెళ్లి లక్ష్మణ్, గొనేపల్లి శేఖర్, ఆవుదుర్తి శ్రీకాంత్, ఉత్తేమ్ సాయి కుమార్, పుడూరి గంగరాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..