telangana
పాలమూరు ఎడారిగా మారడానికి కేసీఆరే కారణం
హైదరాబాద్:గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే పాలమూరు ప్రాంత నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ పొలాలు పూర్తిగా పడావు పడ్డాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాంతం బాగుపడుతుందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఇక్కడి పొలాల్లో నీళ్లు పారుతాయని ఆశించే ఆనాడు ప్రజలు సీనియర్ నాయకుడు విఠల్‌రావును కాదని కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించారని ఆయన గుర్తుచేశారు. అయితే పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ గనుక నిజంగా మనసు పెట్టి ఉంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని, ఆయన నిర్లక్ష్యం వల్లే పాలమూరు రైతులకు అన్యాయం జరిగిందని సీఎం స్పష్టం చేశారు.