telangana
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వచ్చునూరు గ్రామ మాజీ సర్పంచ్
సూర్య తిమ్మాపూర్ : వచ్చునూరు గ్రామంలో ఇటీవల కాలంలో మరణించిన ఉప్పులేటి లచ్చవ్వ కుటుంబానికి శ్రీగిరి రంగారావు 50 కిలోల బియ్యం వితరణ చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హసన్, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పులేటి అనిల్ , వచ్చునూరు గ్రామ ఉపసర్పంచ్ తాళ్లపల్లి మనోహర్, వార్డు సభ్యులు ఉప్పులేటి శంకర్, మాజీ ఉపసర్పంచ్ లు వడ్డే లక్ష్మారెడ్డి, అందె రాజమౌళి, కాంగ్రెస్ నాయకులు వడ్లకొండ రామచంద్రం, వడ్లకొండ శివ శంకరయ్య, నాయకులు అందే శ్రీనివాస్, శ్రీగిరి సత్తయ్య, ఉప్పులేటి సహదేవ్ , కొత్తగాటు రాజమల్లు, అజార్, శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.