ఆళ్లగడ్డ మండలంలో కూటమి ప్రభంజనం
ఆళ్లగడ్డ మండలంలో కూటమి ప్రభంజనం
*పది స్థానాలకు గాను ఆరు టిడిపి.. మూడు వైకాపా... ఒకటి జనసేన కైవసం
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; మండలంలో ఒక జడ్పిటిసి, పది ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. శనివారం ఆళ్లగడ్డ వైపీపిఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ నిర్వహించారు. ఇందులో కూటమికి సంబంధించి ఆరు టిడిపి, ఒకటి జనసేన కైవసం చేసుకోగా వైకాపా మూడు స్థానాలు కైవసం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండలంలోని మిట్టపల్లి, ఆర్ కృష్ణాపురం, నల్లగట్ల, బాచేపల్లి, బత్తలూరు, ఓబులంపల్లి ఎంపీటీసీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. పాత కందుకూరు ఎంపీటీసీ స్థానాన్ని జనసేన కైవసం చేసుకుంది. జి.జంబులదిన్నె, అహోబిలం, కోట కందుకూరు ఎంపీటీసీ స్థానాలను వైకాపా కైవసం చేసుకుంది. ఓట్ల వివరాలు పరిశీలిస్తే మిట్టపల్లి ఎంపిటిసి లో మొత్తం 1616 ఓట్లు పోల్ కాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాశీ పోగుల బక్కన్నకు1452 ఓట్లు, వైకాపా అభ్యర్థికి 121 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్థి 1331 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జీ. జంబులదిన్నె ఎంపిటిసిలో 2,273 ఓట్లు పోల్ కాగా వైసిపి అభ్యర్థి మేకల లక్ష్మికి 2,182 ఓట్లు తెదేపాకు 52 ఓట్లు వచ్చాయి. వైకాపా అభ్యర్థి మేకల లక్ష్మి 2182 మెజార్టీతో విజయం సాధించారు. అహోబిలం ఎంపిటిసి లో 2344 ఓట్లు పోల్ కాగా టిడిపి అభ్యర్థి కి 141 ఓట్లు, వైకాపాకు 2,164 ఓట్లు రాగా వైకాపా అభ్యర్థి భారతి 2,023 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే ఆర్.కృష్ణాపురం ఎంపీటీసీకి 1981 ఓట్లు పోల్ కాగా తెదేపాకు 1,730 ఓట్లు, వైకాపాకు 117 ఓట్లు రాగా తెదేపా అభ్యర్థి గూడూరు రసూల్ బి 1,617 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నల్లగట్ల ఎంపీటీసీ స్థానానికి 2,382 ఓట్లు పోల్ కాగా తెదేపాకు 2,143, వైకాపాకు 205 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శీలం గీతావాణి 1,935 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఓబులంపల్లి ఎంపిటిసి స్థానానికి 2,261 ఓట్లు పోల్ కాగా తెదేపాకు 2,138 ఓట్లు, వైకాపాకు 69 ఓట్లు రాగా తెదేపా అభ్యర్థి దూదేకుల అశోక్ 2,069 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బాచేపల్లి ఎంపిటిసి కి 2,400 ఓట్లు పోల్ కాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 2,126 ఓట్లు , వైకాపాకు 234 ఓట్లు వచ్చాయి. తెదేపా అభ్యర్థి మల్లీశ్వరి బాయ్ 1,892 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కోట కందుకూరు ఎంపీటీసీ స్థానానికి 2,341 ఓట్లు పోల్ కాగా తెదేపా 68, వైకాపాకు 1,969 ఓట్లు రాగా వైకాపా అభ్యర్థి లక్ష్మీదేవి 1,811 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బత్తులూరు ఎంపీటీసీ స్థానానికి 2461 ఓట్లు పోల్ కాగా తెదేపాకు 2,110, వైకాపాకు 216 ఓట్లు రాగా తెదేపా అభ్యర్థి ఇరిగేల మౌనిక 1,894 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పాత కందుకూరు ఎంపీటీసీ స్థానానికి మొత్తం 2512 ఓట్లు పోల్ కాగా జనసేనకు 2163, వైకాపాకు 50 ఓట్లు రాగా జనసేన అభ్యర్థి ఇరిగెల ఉదయశ్రీ 2,163 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా