andhrapradesh
‘మురసు’ తుఫాన్ ప్రభావం: చీరాలలో నిలిచిపోయిన రైళ్లు..
చీరాల:‘మురసు’ తీవ్ర తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా రైలు రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. రక్షణ చర్యల్లో భాగంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో చీరాల రైల్వే స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు నిలిపివేశారు.
బనారస్ నుంచి రామేశ్వరం వెళ్లే ఎక్స్‌ప్రెస్, శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్లే రైళ్లను చీరాల స్టేషన్‌లో నిలిపివేయడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు స్టేషన్‌లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. రైళ్ల నిలిచివేతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు చీరాలకు చెందిన పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక రాజకీయ నాయకులు అండగా నిలిచారు. ప్రయాణికులకు అవసరమైన అల్పాహారం (టిఫిన్), మంచి నీటి సదుపాయాలను ఉచితంగా అందించి ఉదారత చాటుకున్నారు. Weather మరియు ట్రాక్ భద్రతను పరిశీలించిన అనంతరం రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.