BREAKING
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా నవంబర్ 5న వేతనంతో కూడిన సెలవు వెల్దుర్తి బీసీ హాస్టల్, గురుకులాన్ని తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్చరిక ముస్లిం వీధి, మెయిన్ బజార్‌లలో సంక్షేమ పథకాల వివరింపు 28వ వార్డులో సీపీఐకి గట్టి ఎదురుదెబ్బ! తుఫాను ప్రభావంతో కౌంటింగ్ వాయిదా విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి.. కుటుంబానికి అండగా గూడెం మధుసూదన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి!ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మూడు రోజుల్లో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం సమన్వయంతో పనిచేయాలి మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ జన శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో దర్జీ అడ్వాన్స్‌డ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం ఆకస్మిక గాలి వానలు, ఎల్‌నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి – ఎమ్మెల్యే BLR వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పలమనేరు మున్సిపల్ ఎన్నికల తాజా ఫలితాలు అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో నమూనా ఐక్యరాజ్యసమితి సదస్సు కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ విజయభేరి తొలి 12 వార్డుల్లోనూ పసుపు జెండా రెపరెపలు.. వైసీపీకి నిరాశ నెల్లుట్ల లో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ-ప్రభుత్వ పథకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

ఆకస్మిక గాలి వానలు, ఎల్‌నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి – ఎమ్మెల్యే BLR వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

Select Suryaa Now
ఆకస్మిక గాలి వానలు, ఎల్‌నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి – ఎమ్మెల్యే BLR  వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ఆకస్మిక గాలి వానలు, ఎల్‌నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి – ఎమ్మెల్యే BLR

వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:

మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రస్తుతం కురుస్తున్న ఆకస్మిక వర్షాలు, ఈదురుగాలులతో పాటు రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈదురుగాలులు, అకాల వర్షాల కారణంగా పంటలకు కలుగుతున్న నష్టాన్ని ఎప్పటికప్పుడు గుర్తించి, క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు సూచించారు. నష్టపోయిన రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

అలాగే ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఏర్పడే వాతావరణ మార్పులు, వ్యవసాయ రంగంపై వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి రైతులకు తగిన అవగాహన కల్పించాలని సూచించారు.

విద్యుత్ శాఖ అధికారులు గాలివానల సమయంలో విద్యుత్ అంతరాయాలు, ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.

ప్రకృతి వైపరీత్యాల సమయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

రైతుల సంక్షేమం, ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యత అని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే BLR సూచించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.