మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ
సూర్య దస్తురాబాద్ ::దస్తురాబాద్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సయ్యద్ జావీద్ అలీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు హాజరయ్యారు. ఇ సమావేశం లో ముఖ్యంగా రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు,వ్యవసాయ విధ్యుత్ వినియోగం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ,ఉపాధి హామీ, వ్యవసాయ భూముల రీ సర్వే, గ్రామాల్లో పశువులు గొర్ల పెంపకం,గ్రామాల్లో సాగునిటి ,తాగునీటి సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. మండలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వతంగా భవనాలు మంజూరు చేసి నిర్మాణం పూర్తి అయ్యేలా చెయ్యాలని చూడాలని భూట్టాపూర్ సర్పంచ్ గుండా నరేష్ కోరారు. అలాగే ఈ నెల చివరి వరకు మండలంలో అన్ని గ్రామాలకు పంటపొలాలకు చివరి దశలో ఉన్నందున కడెం ప్రాజెక్ట్ ఏడుమ కాలువ ద్వారా పూర్తిగా సాగునీరు అందించాలని దేవునిగూడెం సర్పంచ్ ఎండపల్లి గంగన్న కోరారు..ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధికి అందరూ సమన్వయంతో పనిచేయాలని, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ సయ్యద్ జావీద్ అలీ. మండల తహసీల్దార్ యాదవ రావు. ఎంపీవో రమేష్ రెడ్డి. వ్యవసాయ శాఖ ఏవో మానస, వెటర్నరీ డాక్టర్ సంధ్యారాణి, మండల విద్యాశాఖ అధికారి గంగాధర్, విధ్యుత్ శాఖ ఇంచార్జి ఏఇ శ్రవణ్, గ్రామీణ నీటి సరఫరా ఏఇ విశాల్, ఏపీఓ రవిప్రసాద్, పంచాయతీరాజ్ ఏఇ చందన్,హౌసింగ్ ఏఇ వంశీ, ఐసీ డి ఎస్ సూపర్వైజర్ రాధ, మరియు సిబ్బంది పాల్గొన్నారు