BREAKING
28వ వార్డులో సీపీఐకి గట్టి ఎదురుదెబ్బ! తుఫాను ప్రభావంతో కౌంటింగ్ వాయిదా విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి.. కుటుంబానికి అండగా గూడెం మధుసూదన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి!ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మూడు రోజుల్లో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం సమన్వయంతో పనిచేయాలి మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ జన శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో దర్జీ అడ్వాన్స్‌డ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం ఆకస్మిక గాలి వానలు, ఎల్‌నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి – ఎమ్మెల్యే BLR వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పలమనేరు మున్సిపల్ ఎన్నికల తాజా ఫలితాలు అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో నమూనా ఐక్యరాజ్యసమితి సదస్సు కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ విజయభేరి తొలి 12 వార్డుల్లోనూ పసుపు జెండా రెపరెపలు.. వైసీపీకి నిరాశ నెల్లుట్ల లో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ-ప్రభుత్వ పథకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఏఈఈ సివిల్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ ‘మురసు’ తుఫాన్ ప్రభావం: చీరాలలో నిలిచిపోయిన రైళ్లు.. ఎల్‌నినో ప్రభావంపై పందనపల్లిలో అవగాహన సదస్సు

నెల్లుట్ల లో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ-ప్రభుత్వ పథకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

Select Suryaa Now
నెల్లుట్ల లో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ-ప్రభుత్వ పథకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

లింగాలఘణపూర్, మేజర్ న్యూస్, పాడి పశువుల సంరక్షణతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి సాధ్యమని నెల్లుట్ల గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ అన్నారు. సోమవారం మండల పరిధిలోని నెల్లుట్ల గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని, ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులను గేదెలు, ఆవుల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా పశువులకు నట్టల నివారణ మందు వేయడం ద్వారా వాటిని ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని, తద్వారా పాల దిగుబడి పెరుగుతుందని సూచించారు.అనంతరం వెటర్నరీ వైద్యులు డాక్టర్ వాసు, డాక్టర్ శైలజ మాట్లాడుతూ, జీవాల్లో నట్టల తీవ్రత పెరిగితే రక్తహీనత ఏర్పడి పశువులు నీరసించిపోతాయని, రైతులు విధిగా పశువైద్యుల సలహాలు పాటిస్తూ టీకాలు, మందులు వేయించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డు సభ్యుడు కొయ్యడ అనిల్, స్థానిక రైతులు, పశువుల పెంపకందారులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; కార్తీక్ ,లింగాల ఘనపూర్, జనగామ జిల్లా