BREAKING
శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు. తిరుమలగిరిలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు అన్నవరం గ్రామంలో కూటమి నాయకులతో సామినేని ఉదయభాను ప్రత్యేక సమావేశం షారుఖ్ ఖాన్ పుట్టినరోజు వేడుకలపై సల్మాన్ ఖాన్ స్పెషల్ విష్.. మీ ప్రేరణతోనే కష్టపడ్డానంటూ కింగ్ ఖాన్ బదులు! నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు దశాబ్ద కాలపు ప్రేమ కథకు ముగింపు.. 'ఎ లవ్ అదర్ దాన్ యువర్స్' కే-డ్రామా క్లైమాక్స్ విశ్లేషణ! రామాయణ సినిమాపై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు.. రిలీజ్‌కు ముందే పైరసీ, లీకులకు చెక్ పెడుతూ సంచలన తీర్పు! తూర్పుగోదావరి జిల్లాలో వైకాపాకు గట్టి షాక్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా నవంబర్ 5న వేతనంతో కూడిన సెలవు వెల్దుర్తి బీసీ హాస్టల్, గురుకులాన్ని తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్చరిక ముస్లిం వీధి, మెయిన్ బజార్‌లలో సంక్షేమ పథకాల వివరింపు 28వ వార్డులో సీపీఐకి గట్టి ఎదురుదెబ్బ! తుఫాను ప్రభావంతో కౌంటింగ్ వాయిదా విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి.. కుటుంబానికి అండగా గూడెం మధుసూదన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి!ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

28వ వార్డులో సీపీఐకి గట్టి ఎదురుదెబ్బ!

Select Suryaa Now
28వ వార్డులో సీపీఐకి గట్టి ఎదురుదెబ్బ!

కాంగ్రెస్‌లోకి మాజీ వార్డు మెంబర్‌.. సోదరుడితో కలిసి హస్తం గూటికి

మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న నారపొంగు యాకుబ్‌, మల్సుర్‌.. 

28వ వార్డ్   నుకల రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేరిక

ఖమ్మం రూరల్‌ సూర్య మేజర్ న్యూస్‌:

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్‌ క్రాస్‌ రోడ్డు 28వ వార్డులో సీపీఐకి గట్టి రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ వార్డు మెంబర్‌ నారపొంగు యాకుబ్‌ తన రాజకీయ ప్రయాణానికి స్వస్తి పలుకుతూ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకుని హస్తం గూటికి చేరారు. యాకుబ్‌తో పాటు ఆయన సోదరుడు నారపొంగు మల్సుర్‌ సైతం కాంగ్రెస్‌ పార్టీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

దశాబ్దాల అనుబంధానికి తెర.. కాంగ్రెస్‌ వైపు అడుగులు!

నారపొంగు యాకుబ్‌ గతంలో సీపీఐ తరఫున వార్డు మెంబర్‌గా విజయం సాధించారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ 28వ వార్డులో సీపీఐ అభ్యర్థి గెలుపు కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి కీలకంగా పనిచేశారు. దశాబ్దాలుగా సీపీఐకి అండగా నిలిచిన నారపొంగు కుటుంబం తాజాగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో సీపీఐ బలోపేతానికి కృషి చేసిన నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు అడుగులు వేయడం 28వ వార్డులో రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అభివృద్ధే ఆకర్షించింది.. పొంగులేటి నాయకత్వంలోనే మా ప్రయాణం!

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే కాంగ్రెస్‌లో చేరినట్లు నారపొంగు యాకుబ్‌ తెలిపారు. ఏదులాపురం ప్రాంత అభివృద్ధికి మంత్రి చేస్తున్న కృషి తమను ఆకర్షించిందన్నారు. మంత్రి చొరవతో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించడంతో పాటు అర్హులకు పెన్షన్లు, కొత్త రేషన్‌ కార్డులు అందుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారనే విశ్వాసంతో ఆ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరినట్లు వెల్లడించారు.

కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తాం!

28వ వార్డు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నూకల రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికతో వార్డులో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కొత్తగా పార్టీలో చేరిన యాకుబ్‌, మల్సుర్‌లకు కాంగ్రెస్‌ నాయకులు స్వాగతం పలికారు. మంత్రి పొంగులేటి నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు.