మూడు రోజుల్లో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం సమన్వయంతో పనిచేయాలి
మూడు రోజుల్లో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం సమన్వయంతో పనిచేయాలి
మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టి, రాబోయే మూడు రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.
మంగళవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే BLR ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని సర్పంచులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వీడియో కాల్ ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించేలా గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
అలాగే ఈ నెల 6వ తేదీన మిర్యాలగూడ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు.
రాబోయే రెండేళ్లలో మిర్యాలగూడ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.