విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి.. కుటుంబానికి అండగా గూడెం మధుసూదన్ రెడ్డి
పటాన్‌చెరు: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి అండగా నిలిచారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.బీహార్ రాష్ట్రానికి చెందిన వినయ్ కుమార్ (19) స్థానిక పారగాన్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తూ బండ్లగూడలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తన నివాసం వద్ద ఇంటిపై ఉన్న విద్యుత్ తీగలు తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్‌తో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్మికుడు పనిచేస్తున్న పారగాన్ పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి, మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించాలని కోరారు.అలాగే విద్యుత్ శాఖ తరఫున మృతుడి కుటుంబానికి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. మృతుడి అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు.