కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ విజయభేరి తొలి 12 వార్డుల్లోనూ పసుపు జెండా రెపరెపలు.. వైసీపీకి నిరాశ
కుప్పం మేజర్ న్యూస్:
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. తొలి 12 వార్డుల ఫలితాల్లోనూ టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. కొన్ని వార్డుల్లో భారీ మెజారిటీతో విజయం సాధించగా, మరికొన్ని వార్డుల్లో స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. మరో రెండు వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికై పార్టీ విజయానికి తోడయ్యారు.మొదటి వార్డులో టీడీపీ అభ్యర్థి ఆది 147 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, రెండో వార్డులో రామచంద్ర గౌడ్ 474 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. మూడో వార్డులో వెంకటకృష్ణన్ 28 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. నాలుగో వార్డులో గాయత్రి గౌరప్ప 599 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం అందుకున్నారు.ఐదో వార్డులో అరుణ్ కుమార్, ఆరో వార్డులో సింగారవేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏడో వార్డులో నందగోపాల్ 66 ఓట్ల మెజారిటీతో, ఎనిమిదో వార్డులో ప్రదీప్ 311 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తొమ్మిదో వార్డులో వెంకటాచలం 215 ఓట్ల మెజారిటీతో, పదో వార్డులో రాజేష్ 483 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు.అదేవిధంగా 11వ వార్డులో కళ మురుగేష్ 531 ఓట్ల భారీ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకోగా, 12వ వార్డులో షకీనా గానివుల్ల 111 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.తొలి 12 వార్డుల ఫలితాలు వెలువడటంతో కుప్పం మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఏకగ్రీవ ఎన్నికలతో పాటు ప్రత్యక్ష ఎన్నికల్లోనూ అభ్యర్థులు విజయాలు సాధించడం పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది. వరుస విజయాలతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. తొలి ఫలితాల్లోనే స్పష్టమైన ఆధిక్యం కనిపించడంతో కుప్పం మున్సిపల్ రాజకీయాల్లో టీడీపీ తన పట్టును మరోసారి చాటుకున్నట్లయింది.