మదనపల్లె మున్సిపల్ ఎన్నికల లెక్కింపు: తొలి రౌండ్‌లో టీడీపీ, బీజేపీ కూటమి
మదనపల్లె మున్సిపల్ ఎన్నికల లెక్కింపు: తొలి రౌండ్‌లో టీడీపీ, బీజేపీ కూటమి ముందంజ
మదనపల్లె:
మదనపల్లె మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం స్థానిక ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉత్కంఠభరితంగా ప్రారంభమైంది. మొదటి రౌండ్ ఫలితాలు వెలువడేసరికి టీడీపీ, బీజేపీ అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.
తొలి రౌండ్ ఫలితాల వివరాలు:
* 13వ వార్డు: టీడీపీ అభ్యర్థి 681 ఓట్లు సాధించగా, వైసీపీ అభ్యర్థికి 283 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ 398 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
* 12వ వార్డు: బీజేపీ అభ్యర్థి 640 ఓట్లు పొందగా, వైసీపీకి 333 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీ 307 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
* 11వ వార్డు: బీజేపీ అభ్యర్థి 581 ఓట్లతో, వైసీపీ అభ్యర్థి (475 ఓట్లు) పై 106 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇంకా పలు రౌండ్ల లెక్కింపు కొనసాగుతుండటంతో తుది ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి ఫలితాలు కాసేపట్లో వెల్లడి కానున్నాయి.
సి. శ్రీనివాసులు సూర్య స్టాఫ్ రిపోర్టర్ మదనపల్లి