BREAKING
ముస్లిం వీధి, మెయిన్ బజార్‌లలో సంక్షేమ పథకాల వివరింపు 28వ వార్డులో సీపీఐకి గట్టి ఎదురుదెబ్బ! తుఫాను ప్రభావంతో కౌంటింగ్ వాయిదా విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి.. కుటుంబానికి అండగా గూడెం మధుసూదన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి!ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మూడు రోజుల్లో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం సమన్వయంతో పనిచేయాలి మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ జన శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో దర్జీ అడ్వాన్స్‌డ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం ఆకస్మిక గాలి వానలు, ఎల్‌నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి – ఎమ్మెల్యే BLR వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పలమనేరు మున్సిపల్ ఎన్నికల తాజా ఫలితాలు అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో నమూనా ఐక్యరాజ్యసమితి సదస్సు కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ విజయభేరి తొలి 12 వార్డుల్లోనూ పసుపు జెండా రెపరెపలు.. వైసీపీకి నిరాశ నెల్లుట్ల లో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ-ప్రభుత్వ పథకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఏఈఈ సివిల్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ ‘మురసు’ తుఫాన్ ప్రభావం: చీరాలలో నిలిచిపోయిన రైళ్లు..

తుఫాన్ ప్రభావంతో వత్సవాయిలో కొనసాగుతున్న వర్షాలు రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన.. నిర్మానుష్యంగా మారిన రహదారులు

Select Suryaa Now
తుఫాన్ ప్రభావంతో వత్సవాయిలో కొనసాగుతున్న వర్షాలు  రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన.. నిర్మానుష్యంగా మారిన రహదారులు

 

వత్సవాయి: తుఫాన్ ప్రభావంతో వత్సవాయి మండలంలో వర్షాలు కొనసాగుతున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి వర్షంతో మండలంలో జనజీవనం స్తంభించింది. వర్షం కారణంగా ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పనులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. సాధారణంగా రద్దీగా ఉండే రహదారులు సైతం ప్రజలు, వాహనాల రాకపోకలు లేక బోసిపోయాయి.

వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తుఫాన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీస్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందించేలా సంబంధిత శాఖల సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.

ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.