BREAKING
విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి.. కుటుంబానికి అండగా గూడెం మధుసూదన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి!ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మూడు రోజుల్లో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం సమన్వయంతో పనిచేయాలి మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ జన శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో దర్జీ అడ్వాన్స్‌డ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం ఆకస్మిక గాలి వానలు, ఎల్‌నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి – ఎమ్మెల్యే BLR వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పలమనేరు మున్సిపల్ ఎన్నికల తాజా ఫలితాలు అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో నమూనా ఐక్యరాజ్యసమితి సదస్సు కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ విజయభేరి తొలి 12 వార్డుల్లోనూ పసుపు జెండా రెపరెపలు.. వైసీపీకి నిరాశ నెల్లుట్ల లో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ-ప్రభుత్వ పథకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఏఈఈ సివిల్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ ‘మురసు’ తుఫాన్ ప్రభావం: చీరాలలో నిలిచిపోయిన రైళ్లు.. ఎల్‌నినో ప్రభావంపై పందనపల్లిలో అవగాహన సదస్సు తుఫాన్ ప్రభావంతో వత్సవాయిలో కొనసాగుతున్న వర్షాలు రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన.. నిర్మానుష్యంగా మారిన రహదారులు సూళ్లూరుపేట, వెంకటగిరి, గుత్తి, పెనుకొండ కూటమి కైవసం.. పుంగనూరులో టీడీపీ ఘనవిజయం

కౌంటింగ్ కేంద్రంలో వివాదం -బీజేపీ నేతను తోసేసిన పోలీసులు -జనరల్ ఏజెంటైన తనను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని బీజేపీ పొనగంటి భాస్కర్‌ ఆగ్రహం

Select Suryaa Now
కౌంటింగ్ కేంద్రంలో వివాదం  -బీజేపీ నేతను తోసేసిన పోలీసులు  -జనరల్ ఏజెంటైన తనను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని బీజేపీ పొనగంటి భాస్కర్‌ ఆగ్రహం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: తిరుపతిలోని ఎస్ వి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద వివాదం చోటుచేసుకుంది. ఎస్ వి ఆర్ట్స్ కళాశాలలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత బిజెపి జనరల్ ఏజెంట్ భాస్కర్ కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. భాస్కర్  మీడియాతో మాట్లాడుతూ 24వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థికి తాను జనరల్ ఏజెంట్ గా ఉన్నానన్నారు. తనను కౌంటింగ్ కేంద్రంలోనికి వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకున్నారని వాపోయారు. తనను తోసేసి దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడ్డుకున్న పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్పీని కోరారు. లేదంటే కౌంటింగ్ కేంద్రం వద్ద బిజెపి కార్యకర్తలతో నిరసన తెలియజేస్తానని తెలిపారు. ఇద్దరు ముగ్గురు జనరల్ ఏజెంట్లను మాత్రం లోపలికి అనుమతి ఇచ్చారని, తనను మాత్రం అనుమతించలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఏ అధికారంతో తనను అడ్డుకున్నారని, మీడియా సాక్షిగా తనను గెంటివేశారన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఉన్న డీఎస్పీ భక్తవత్సలం బయటికి వచ్చి ఆయనకు సర్ది చెప్పారు. తనకు అవమానం జరిగిందని, తనను లోనికి అనుమతించలేదని భాస్కర్ ఆయనతో చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీలో ఉన్న తనను  అడ్డుకోవడం ఏమిటని, బిజెపి పార్టీకి ఏజెంట్గా ఉన్న తనను ఎలా అడ్డుకుంటారన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి జనరల్ ఏజెంట్‌ను లోపలికి అనుమతించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్