BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

మానవతా సేవకు ముందడుగు! గోకవరం కైలాసగిరికి రెండు ఫ్రీజర్లు

Select Suryaa Now
మానవతా సేవకు ముందడుగు! గోకవరం కైలాసగిరికి రెండు ఫ్రీజర్లు

                              అనాథ శవాలకు ఉచిత అంత్యక్రియలు  :24 గంటలూ అందుబాటులో సేవలు
గోకవరం, మేజర్ న్యూస్ :  మానవత్వంతో సేవే లక్ష్యంగా గోకవరం కైలాసగిరి నిర్వాహకులు సుంకర వీరబాబు అందిస్తున్న సేవలకు మరో గుర్తింపు లభించింది. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన మానవతా సంస్థలు కైలాసగిరికి రెండు ఫ్రీజర్లను అందజేసి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నాయి. గతంలో గోకవరం ప్రాంతంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల నిమిత్తం రాజమహేంద్రవరం వెళ్లాల్సి వచ్చేది. దీంతో పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవి. ఈ పరిస్థితిని గుర్తించిన సుంకర వీరబాబు గ్రామ పెద్దలు, దాతల సహకారంతో గోకవరంలో కైలాసగిరిని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా దిక్కులేని అనాథ శవాలకు ఒక్క రూపాయి తీసుకోకుండా అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. సుంకర వీరబాబు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన మానవతా సంస్థలు కైలాసగిరికి రెండు ఫ్రీజర్లను అందించాయి. ఈ కార్యక్రమానికి తనవంతు సహకారంగా గజింగం సత్తిబాబు రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందించి ఫ్రీజర్ కొనుగోలుకు తోడ్పడ్డారు. తాను మానవతా సంస్థలో సభ్యుడిగా సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సుంకర వీరబాబు మాట్లాడుతూ గోకవరం మండలంలో ఏ గ్రామానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారు మరణించినా వారి కుటుంబాలకు అవసరమైన ఫ్రీజర్ సేవలను ఉచితంగా అందిస్తామని తెలిపారు. అత్యవసర సమయంలో ఎప్పుడు ఫోన్ చేసినా 24 గంటల్లో అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. కైలాసగిరి సేవలకు తనతో పాటు పలువురు సభ్యులు, దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్నవారికి ఆసరాగా నిలిచే ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకం. మానవత్వానికి కులమతాలు లేవని చాటుతున్న గోకవరం కైలాసగిరి సేవలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.