BREAKING
పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండి నిత్యవసర ధరలను నియంత్రించాలి-రేషన్ లో 14 రకాల సరుకులు ఇవ్వాలి.. వరుణ్ సందేశ్ యద్భావం తద్భవతి చిత్రం నుండి జిజెన్ చిక సాంగ్ విడుదల మున్నూరు కాపు  పటేల్స్ సంఘం ఎన్నికల రాష్ట్ర కోఆర్డినేటర్ గా కాస రాజు పటేల్ నియామకం కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలి జిల్లా కలెక్టర్ కె.హరిత

కూటమి విజయమే లక్ష్యంగా సమన్వయంతో పని చేద్దాం.

Select Suryaa Now
కూటమి విజయమే లక్ష్యంగా సమన్వయంతో పని చేద్దాం.

కంబదూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కంబదూరు జడ్పీటీసీ కూటమి అభ్యర్థి హారిక చంద్రమౌళి పిలుపునిచ్చారు. కూటమి పార్టీల మధ్య ఐక్యత, పరస్పర సహకారం ఎన్నికల్లో విజయానికి కీలకమని ఆమె పేర్కొన్నారు. కూటమి పొత్తులో భాగంగా కంబదూరు జడ్పీటీసీ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించిన నేపథ్యంలో, ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె స్థానిక టీడీపీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సహకారంతో కూటమి శ్రేణులన్నీ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించాలని, కూటమి పార్టీల మధ్య పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసుకోవాలని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు ఒకే లక్ష్యంతో పనిచేస్తే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు రామ్‌మోహన్ చౌదరి, దండా వెంకటేశులు, లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచులు శ్రీరాములు, లింగా సురేంద్ర, స్థానిక నాయకులు ఆవుల తిప్పేస్వామి, ఎర్రిస్వామి, ములకనూరు క్లస్టర్ ఇన్‌చార్జి తిమ్మరాయుడులను జడ్పీటీసీ అభ్యర్థి హారిక చంద్రమౌళి సన్మానించారు. సీనియర్ నాయకులను మర్యాదపూర్వకంగా కలుసుకుని వారి సహకారాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కంబదూరు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.