BREAKING
'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య నాణ్యమైన తాగునీరందించడమే లక్ష్యం.. 13 వ వార్డు లోనాగవంశం కులస్తులకు వైసిపి టికెట్ కేటాయించాలి

ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి

Select Suryaa Now
ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి

కురిచేడు మేజర్ న్యూస్ : ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన అర్బన్‌ 2.0 పథకం కింద కురిచేడు గ్రామానికి మంజూరైన ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన ప్రారంభించాలని దర్శి హౌసింగ్ సబ్‌డివిజన్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ డి. నిరీక్షణ రావు సూచించారు. కురిచేడు మండల పరిషత్‌ సమావేశ మందిరంలో గృహ నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులతో అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కో గృహానికి ప్రభుత్వం రూ.2.89 లక్షల యూనిట్‌ వ్యయం కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించిన కొలతలు, ప్రమాణాలతోనే ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని గృహ నిర్మాణాలను ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి MPDO సత్య ప్రసాద్, మండల గృహ నిర్మాణశాఖ ఇంచార్జి వెంకట కొండయ్య, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ బి. మరియదాసు, సచివాలయ సిబ్బంది, PMAY కురిచేడులబ్ధిదారులు పాల్గొన్నారు.