BREAKING
. నెరవేరిన సొంతింటి కల.. ఇందిరమ్మ ఇంట్లో జంపాల భాగ్యమ్మ–యోగానందం దంపతుల గృహప్రవేశం మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా ప్రారంభించి,- ఉపాధి అవకాశాలపై అవగాహన రాఘవపూర్ శివారులో గంజాయి పట్టివేత.. - నిందితుడిపై కేసు నమోదు అంసాన్ పల్లి గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ సైబర్ నేరాల నుంచి నిన్ను నీవు రక్షించుకోండి *అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రిపై అసత్య ఆరోపణలు* రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎస్వీయూలో ‘అన్వేషణ-2026’ ప్రారంభం -జ్ఞానానికి ఆవిష్కరణ జోడిస్తేనే భవిష్యత్ : రెక్టర్ ఆచార్య చెండ్రాయుడు కొల్చారంలో ఆల్ ఇండియా బంజారా మేళా ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి రేణిగుంటలో ఓటర్ స్లిప్పుల బీఎల్వోలు ఇవ్వలేదని ఓటర్ల ఆగ్రహం.. పైతర గ్రామంలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం జడ్పిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం.. 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. 10782 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు పేట స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా నరసింహ చారి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు

హిరమండలంలో విజయానికి త్రివేణి విస్తృత పర్యటన

Select Suryaa Now
హిరమండలంలో విజయానికి త్రివేణి విస్తృత పర్యటన

కొత్తూరు, సూర్య : పాతపట్నం నియోజకవర్గం హిరమండలం జడ్పిటిసి బీజేపిఅభ్యర్థిగా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు సతీమణి సిరిపురం త్రివేణి గెలుపునకు కూటమి పార్టీలు శక్తి వంచన లేకుండా పర్యటించి ఓటర్లను స్వయంగా కలుస్తున్నారు. జిల్లా పరిషత్ కు పంపించేందుకు జడ్పిటిసి గా గెలిపించాలని ఓటర్లను కలసి ఓటర్లను అభ్యర్థించారు. మండలం లో సమస్యలు గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తానని తన ఎన్నికల ప్రచారంలో ఓటర్లని తెలియజేశారు.కూటమి నేతలతో కలసి ఇంటింట ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకోవడం విశేషం.హిరమండలం జడ్పిటిసి అభ్యర్థి త్రివేణి గెలుపు కోసం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు విస్తృత ప్రచారం చేశారు. ఇదిలా ఉండగాఎన్నికల ప్రచారం చివరి రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా ద్వారా వీడియో ప్రకటన విడుదల చేస్తూ హిరమండలం జడ్పిటిసి బీజేపి  అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిరిపురం త్రివేణి గెలుపునకు కమలం గుర్తు పై ఓట్లు గెలిపించాలని విడుదల చేసిన ప్రకటన కూటమి పార్టీల్లో సంచలనం సృష్టించిందని పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్రం లో ప్రధాని మోడీ ,రాష్ట్రంలో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ నేతృత్వం లో బలమైన అభివృద్ధి సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నామని , అదేవిధంగా  ప్రధాని మంత్రి మోడీ స్పూర్తి తో జిల్లా బీజేపి అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు జిల్లా లో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తున్నారని అన్నారు.ఈ అభివృద్ధి ఫలాలు గ్రామాలకు చేరాలంటే బలమైన స్థానిక సంస్థల వ్యవస్థ ఉండాలని,అందువల్ల కూటమి అభ్యర్థి సిరిపురం త్రివేణి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కింజరాపు సోషల్ మీడియా లో విడుదల చేసిన ప్రకటనలో కూటమి నేతలకు పిలుపునిచ్చారు. ఈ వీడియో మండలంలో పెద్ద సంచలనం సృష్టిస్తోంది.ఈ వీడియో త్రివేణి విజయానికి దోహద పడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.