గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామ సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి చౌలూరు రాధమ్మ ఘన విజయం!!
గుమ్మగట్ట మేజర్ న్యూస్:
గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చౌలూరు రాధమ్మ సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు,ఎన్నికల ఫలితాలు వెలువడగానే గ్రామంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు,తనను ఆశీర్వదించి గెలిపించిన బేలోడు గ్రామ ప్రజలందరికీ చౌలూరు రాధమ్మ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు.