బృందావన్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. నగరం లోని సంతపేట నాగాలమ్మ గుడి సమీపంలో గల బృందావన్ సీనియర్ సెకండరీ పాఠశాలలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ శైలజ కుమారి పాఠశాల డైరెక్టర్ ప్రియ తేజ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ క్రమంలో డైరెక్టర్ ప్రియ తేజ , ప్రిన్సిపాల్ టి.వి. సుబ్రహ్మణ్యం భారత రాజ్యాంగం యొక్క విశిష్టత, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు బాధ్యతలు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ మౌలిక సూత్రాల గురించి విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగం ప్రతి పౌరునికి మార్గదర్శకమని, దాని ఆశయాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని వారు విద్యార్థులకు సూచించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా వివిధ నృత్యాలు, నాటికలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తో పాటు రాజ్యాంగ ముసాయిదా కమిటీలోని ఇతర ప్రముఖ సభ్యుల వేషధారణలో విద్యార్థులు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.