గొర్రెల కాపరి పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి అక్కడికి అక్కడే మృతి....
వెల్దుర్తి సూర్య ప్రతినిధి రూరల్ మేజర్ న్యూస్ :మండల పరిధిలోని బింగి దొడ్డి గ్రామానికి చెందిన బోయ రాముడు కుమారుడు గొర్రెల కాపరి నవీన్ 23 బుధవారం రాత్రి సమయంలో గొర్రెల మందను విసి కంపెనీకి సమీపంలో ఆపుకొని ఉండగా రోడ్డు మార్గంలో బైకుపై వెళ్తున్న ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బైకు ఆపుకొని ఉండగా మృతుడు నవీన్ గమనించి టార్చిలైట్ వేయడంతో ఆ ముగ్గురు యువకులు గొర్రెల మంద దగ్గరకు చేరుకొని గొర్రెల కాపర్లపై దాడి చేయడంతో నవీన్ అనే గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆ ముగ్గురి యువకులలో ఒకరిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు సమాచారం. మృతి చెందిన యువకుడిని వెల్దుర్తి సిహెచ్సి ప్రభుత్వ వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించారు. ఘర్షణ విషయాలు బయటకి రావాల్సి ఉంది. సూర్య ప్రతినిధి కే రాజశేఖర్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం