BREAKING
పేదలకు ఉచిత నిత్యవసర సరుకుల పంపిణి కండ్లకోయలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి సింగరేణి కార్మికులకు రూ.1.10 లక్షల దీపావళి (పీఎల్ఆర్) బోనస్ యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి దోర్నాలకు త్వరలో అన్నా క్యాంటిన్… స్వచ్ఛ అవార్డ్ గ్రహీత గ్రామ కార్యదర్శి కి ఘన సన్మానం ఓబీసీల సింహగర్జనకు తరలి రావాలి 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి శివాజీ పార్క్ నిరసనలో షబానా ఆజ్మీ, నసీరుద్దీన్ షా: ఓటర్ల జాబితా అక్రమాలపై సీజేపీ ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు, నిర్వాహకులపై కేసు నమోదు దురద కుంటలో ఎస్ఎంసి ఎన్నికలు ప్రశాంతం, మల్లాపురంలో వాయిదా. కొత్త ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన గౌస్ మోహిద్దీన్, పార్లమెంటు ఆర్థిక కమిటీ పునర్వ్యవస్థీకరణ: వరుసగా కమిటీ ఛైర్మన్‌గా భర్తృహరి మహతాబ్, సభ్యులుగా చిదంబరం, ప్రఫుల్ పటేల్, గౌరవ్ గొగోయ్ విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ కిడ్నీ వ్యాధి బాధితుడికి ఆర్థిక సహాయం.

ఏ ఈ ఆర్ ప్రణాళికపై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలి

Select Suryaa Now
ఏ ఈ ఆర్  ప్రణాళికపై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలి

*అధికారులకు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశం.

 సూర్య ప్రతినిధి,మార్కాపురం: 

అమరావతి ఎకనామిక్ రీజియన్ ఏ ఈ ఆర్  ప్రణాళికలో భాగంగా మార్కాపురం జిల్లాకు సంబంధించి సమగ్ర అభివృద్ధి ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మార్కాపురం కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఏ ఈ ఆర్  వర్క్‌షాప్‌లో కలెక్టర్ పాల్గొని వివిధ శాఖల అధికారులతో జిల్లాలోని అభివృద్ధి అవకాశాలు, భవిష్యత్ అవసరాలపై చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అందుబాటులో ఉన్న సహజ వనరులు, భౌగోళిక పరిస్థితులు, వ్యవసాయ, ఉద్యానవన, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో ఉన్న అవకాశాలను సమగ్రంగా గుర్తించాలని సూచించారు. ఏ ఈ ఆర్  ప్రణాళిక ద్వారా జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేలా, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలన్నారు.ప్రతి శాఖ తమ పరిధిలో జిల్లాకు అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, రవాణా సౌకర్యాలు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పర్యాటక రంగం, తాగునీరు, పట్టణ–గ్రామీణ మౌలిక వసతులకు సంబంధించిన వివరాలను సేకరించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతి ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను గుర్తించి, దానికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికలో పొందుపరచాలని తెలిపారు.అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి వాస్తవ పరిస్థితులు, ప్రజల అవసరాలు, భవిష్యత్‌లో ఏర్పడే అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 

కేవలం ప్రస్తుత అవసరాలకే పరిమితం కాకుండా రాబోయే సంవత్సరాల్లో జిల్లాకు ప్రయోజనం కలిగే విధంగా దీర్ఘకాలిక దృష్టితో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.జిల్లాను హార్టికల్చర్ హబ్ లో చేర్చడం వరమిని దానికి అనుగుణంగా మనం ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను కలెక్టర్ వివరించారు.

ఈ కార్యక్రమం లో ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ సురేష్ బాబు, ఉద్యాన శాఖ అధికారి రమేష్, సిఆర్డిఏ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.