దోర్నాలకు త్వరలో అన్నా క్యాంటిన్…
అన్నా క్యాంటిన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించిన టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు…
పంచాయతీ కార్యాలయం - ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుకు స్థల పరిశీలన...!!
దోర్నాలలో అన్నా క్యాంటిన్ ఏర్పాటుకు స్థల పరిశీలన స్థలాన్ని పరిశీలిస్తున్న టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు.
పెద్ద దోర్నాల మేజర్ న్యూస్
పెద్ద దోర్నాల లో స్థానిక
పంచాయతీ కార్యాలయం -ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు స్థలాన్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గూడూరి. ఎరిక్షన్ బాబు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ. దోర్నాల గ్రామపంచాయతీ . పక్కన ఆర్టీసీ బస్టాండ్.కు సమీపంలో ఉన్న స్థలములో త్వరలోనే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దోర్నాల మండల టిడిపి అధ్యక్షులు షేక్ మాబు బట్టు. సుధాకర్ రెడ్డి. ఏరువా. మల్లికార్జున్ రెడ్డి బిజెపి మూడు నియోజకవర్గాల ఇన్చార్జి. తంగిరాల . అశోక్ రెడ్డి. దోర్నాల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కేతి. వెంకట మురళి . వల్లపునేని. కాశయ్య దొడ్డ. శేషాద్రి .చంటి . డి ఈ. సుబ్బారెడ్డి కొప్పుల.సుబ్బారెడ్డి బట్టు. రమణారెడ్డి బోళ్ల .బాలకృష్ణ . చిటే. శివారెడ్డి .ఈ. దేవయ్య .రఫీ. దేసు. నాగేంద్రబాబు .షేక్ . మంజూరు. షేక్. జిలాని. కటికల .దానం. గుంటక సుబ్బరాయుడు పప్పతి.సుబ్బారావు . కటికల.శ్రీను. కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కడపరాజుపల్లె గ్రామంలోఘనంగా జాతీయ పోషణ మాసోత్సవం.
పెద్ద దోర్నాల మేజర్ న్యూస్.
పెద్దదోర్నాల మండలంలోని కడపరాజుపల్లె గ్రామంలో9వజాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగానిర్వహించారు. ఐసీడీఎస్ దోర్నాల ప్రాజెక్ట్ సీడీపీఓ ఏ. లక్ష్మీబాయి సూపర్‌వైజర్ ఎం .అంజమ్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
కడపరాజుపల్లె అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిడిపిఓ ఏ .లక్ష్మీబాయి మాట్లాడుతూ చిన్నారులు గర్భిణులు బాలింతలు మహిళలకు పౌష్టికాహారంప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. చిన్నారుల శారీరక మానసిక ఎదుగుదలకు సమతుల్యమైన పోషకాహారం ఎంతో అవసరమని సిబ్బంది వివరించారు.
రోజువారీ ఆహారంలో ఆకుకూరలు కూరగాయలు పప్పుధాన్యాలు చిరుధాన్యాలు పండ్లు గుడ్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలనిసూచించారు. గర్భిణులు బాలింతలు ప్రత్యేక శ్రద్ధతో పౌష్టికాహారం తీసుకోవాలనితెలిపారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నారులఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పోషకాహార లోపంలేకుండాతల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్వైజర్ ఎం అంజమ్మ మాట్లాడుతూ. చిన్నారు ఆరోగ్యముగా ఎదగడముతో పాటు గర్భిణీలు బాలింతలు కిశోర బాలికలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు పోషకాహారము ఎంతో కీలకమని అన్నారు. బాలింతలకు సమతుల్య ఆహారము తీసుకోవడం కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రతలు పాటించడంలో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడికార్యకర్తలు ప్రిస్కిల్లా అనూష బాయ్ .కె .సునీత పి. అమల .ఆశ .ఆదిలక్ష్మి ఏఎన్ఎం. ఆనంద. కుమారి వెంకటమ్మ .బాలింతలు గర్భవతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.