భైరవకోనలో పాఠశాల విద్యార్థుల సందడి
సిఎస్ పురం,మేజర్ న్యూస్: ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పర్యాటక శైవక్షేత్రమైన భైరవకోనలో శుక్రవారం సెలవుదినం కావడంతో పలువురు భక్తులు పాఠశాల విద్యార్థులతో సందడి నెలకొన్నది.ఉమ్మడి ప్రకాశంజిల్లా ఉలవపాడు మండలం కరేడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ముందుగా స్థానిక జలపాతం వీక్షించి అనంతరం శ్రీత్రిముఖ దుర్గభర్గులేశ్వరస్వామి కాలభైరవేశ్వరస్వామి నగరేశ్వరస్వామి ఇతర శివలింగాలను దర్శించుకుని పూజలుచేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈసందర్భంగా భైరవకోన విశిష్టత ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అర్చకుల బృందం వివరించారు.అదేవిధంగా భైరవకోన ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల శ్యామసుందరరాజు,ఈఓ డి.వంశీకృష్ణారెడ్డి సూచనల మేరకు దేవస్థానం సిబ్బంది భక్తులకు పర్యాటకులకు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వసతులు ఏర్పాటు చేశారు.