బీసీల ద్రోహి జగన్.
బీసీల అభివృద్ధిని అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ కుట్ర.
నాడు ఎన్టీఆర్ నేడు చంద్రబాబులతోనే బీసీల అభివృద్ధి.
బాబాయి హత్య అబ్బాయి కే లాభం.
టిడిపిలోని బీసీలకు సముచిత స్థానం.
బీసీలకు వెన్నుపోటు పొడిచిన సైకో జగన్.
బీసీ రాజకీయంగా ముందుకు తీసుకెళుతుంది టిడిపినే.
24 శాతానికి బీసీ రిజర్వేషన్ తగ్గించిన వైసీపీ.
దర్శి లో ముగ్గురు బీసీలను మండల టిడిపి అధ్యక్షులుగా నియమించిన ఘనత గొట్టిపాటి లక్ష్మీదే.
దర్శి మేజర్ న్యూస్. బాబాయి హత్య అబ్బాయికి లాభం అని, బీసీలను రాజకీయంగా అనగదొక్కి వారిపై దాడులు హత్యలు చేయించిన ఘనత గొడ్డలి పార్టీ నాయకుడు జగన్ దేనిని బీసీ నాయకులు అన్నారు.
దర్శి పట్టణం లోని టిడిపి కార్యాలయం నందు నియోజకవర్గం లోని తెలుగుదేశం పార్టీ బీసీ సోదరులు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్బంగా బీసీ నాయకులు మాట్లాడుతూ.ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూజి 105, జీవో 1065 లను తీసుకువచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలలో నూతన ఉత్సాహాన్ని నింపారన్నారు.
కానీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా హైకోర్టులో పిటిషన్లు వేయించి, బీసీలకు వెన్నుపోటు పొడిచిందన్నారు.
ఎన్నికలు జరగకూడదని బీసీలకు రిజర్వేషన్ దక్కకూడదని కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు అడ్డుకున్నారు. అయినా సరే వదిలే ప్రసక్తి లేదు! బీసీలకు మళ్లీ ఆ 34% రిజర్వేషన్లు దక్కే వరకు పిడికిలి బిగించి సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబు నాయుడు న్యాయపోరాటం చేస్తున్నారన్నారు.
34% నుంచి 24%కి తగ్గించి 16,800 మంది బీసీల రాజకీయ భవితను గొడ్డలి పార్టీ కాలరాశిందన్నారు.
దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గౌరవనీయులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దర్శి దొనకొండ , కురిచేడు మండలాలకుటిడిపి అధ్యక్షులను బీసీలను నియమించితెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని తెలియజేశారు.
బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములు చేసేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది అని దర్శి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులుతెలియజేశారు.
ఈ కార్యక్రమం లో దర్శి, దొనకొండ, కురిచేడు మండలాల టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, మోడీ ఆంజనేయులు, పిడతల నెమిలయ్య దర్శి ఏఎంసి వైస్ చైర్మన్ కోడిగ మస్తాన్ రావు, దర్శి మండల దర్శి మండల బీసీ సెల్ అధ్యక్షులు మేకనబోయిన సత్యనారాయణ, కౌన్సిలర్ రామ్ గిరి, బత్తుల శ్రీనాథ్, బెల్లా శ్రీను, అంకాల వెంకటేశ్వర్లు, కంచర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.