BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

అన్నవరప్పాడు వెంకన్న ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు

Select Suryaa Now
అన్నవరప్పాడు వెంకన్న ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు

పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో 16వ నంబరు జాతీయ రహదారి పక్కన పునర్నిర్మాణం జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున విరాళాలు అందిస్తున్నారు.ఈ క్రమంలో నవంబర్ 1వ తేదీ ఆదివారం ఏలూరు వాస్తవ్యులు ఆకుల సత్యనారాయణ, నాగమణి దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.11,116 విరాళంగా సమర్పించారు.అదేవిధంగా విజయవాడ వాస్తవ్యులు పావురాల యజ్ఞ రామ జయకుమార్, నాగ వెంకట దుర్గా లక్ష్మీదేవి దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి రూ.5,116 విరాళంగా అందజేశారు.శ్రీ స్వామివారి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించడం పట్ల ఆలయ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ విరాళాల వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ తెలియజేశారు.