BREAKING
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి రాజమండ్రి కార్పొరేషన్‌లో విలీనం, వార్డుల పునర్విభజన పిటిషన్లు కొట్టివేత.. 6 వారాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఏపీ హైకోర్టు ఆదేశం గణిత బోధనలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలి.. డి ఈ ఓ అయూబ్ గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా మోహన్‌లాల్‌తో కలిసి నటించడం అదృష్టం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ రొడ్డు మరమ్మత్తు పనులు పరిశీలించిన కమిషనర్ భవిష్యత్ మొత్తం సోలార్ మయమే వృద్ధులకు అండగా న్యాయ సేవాధికార సంస్థ :కనిగిరి జడ్జి బి. రూపశ్రీ వైద్య శిబిరానికి మంచి స్పందన అలియా భట్, కార్లోస్ సైంజ్ క్రేజీ కొలాబరేషన్.. లొరియల్ Paris అడ్వర్టైజ్‌మెంట్‌తో సోషల్ మీడియాలో రికార్డులు గాంధీజీ ఆశయాలను ఆచరించాలి ఎన్నికల సంఘాన్ని రద్దు చేసి కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయాలి* ఎం.ఎం.హళ్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి పయ్యావుల కేశవ్ నటి రన్యారావుకు బిగ్ షాక్.. బంగారం స్మగ్లింగ్ కేసులో రూ.89 కోట్ల భారీ జరిమానా బొటానిక్స్ పరిశ్రమను ప్రారంభించిన ఎం.ఎస్.ఎం.ఇ రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాసరావు

ఆర్థిక అసమానతలు లేని సమాజం సీఎం చంద్రబాబు లక్ష్యం

Select Suryaa Now
ఆర్థిక అసమానతలు లేని సమాజం సీఎం   చంద్రబాబు లక్ష్యం

 

పింఛన్ల పంపిణీలో దేశానికి ఆదర్శం ఏపీ. 

పేదల సేవలో  డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.

 

 గొట్టిపాటి లక్ష్మీ కి ఘనంగా, ఆత్మీయంగా సుస్వాగతం పలికిన ఖాశీపురం గ్రామ ప్రజానీకం.

కురిచేడు మేజర్ న్యూస్.

 సంక్షేమ పథకాలు పింఛన్లు అందించడ మే కాకుండా ప్రతి ఒక్కరికి స్థిరమైన జీవనోపాధి కల్పించి  పేదరికం నిర్మూలించడంతోపాటు ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. దర్శి నియోజకవర్గంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ  పాల్గొన్నారు.

 కురిచేడు మండలంలోని పడమర ఖాశీపురం లో  డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్  గ్రామం లో పర్యటించి అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ లను అందజేస్తూ, వారి సంక్షేమానికి , కష్టసుఖాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ఆత్మీయ భరోసానిచ్చారు.

 వృద్ధులు, వికలాంగులు పింఛనుదారుల ముఖాల్లో చిరునవ్వులు నింపడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని గొట్టిపాటి లక్ష్మీ  అన్నారు.

 ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగువేణి - సుబ్బారావు, కురిచేడు మండల టిడిపి అధ్యక్షులు విడతల నెమిలయ్య, ఒంగోలు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, ఎంపీడీఓ, క్లస్టర్ ఘనపతి వెంకటేశ్వర్లు, ఐ. టిడిపి మండల అధ్యక్షులు కాళ్ల వెంకటేశ్వర్లు, కాశీపురం గ్రామ టిడిపి నాయకులు శేఖర్,చిన్న వెంకట సుబ్బయ్య, కాటం రాజు, మాజీ సర్పంచ్ సుబ్బయ్య, వీరనారాయణ, మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ మస్తాన్ వలి, డాక్టర్ సునీల్,  ఆదినారాయణ, నూనె విజయకుమారి, ఇజ్రాయల్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.