50 ఏళ్ల ప్రజల నిరీక్షణకు తెర
కాశిపురం టు వెల్లంపల్లి రోడ్డు నిర్మాణానికి కోటి 85 లక్షల నిధులు మంజూరు చేయించిన గొట్టిపాటి లక్ష్మి..
రెండు జిల్లాల ప్రజలకు తీరనున్నా రవాణా ఇబ్బందులు.
ఇప్పటికేఆవుల మంద టు మిరియంపల్లి గుండ్లకమ్మ పై బ్రిడ్జి ప్రారంభం.
కురిచేడు మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.
దర్శి మేజర్ న్యూస్. దర్శి నియోజకవర్గ అభివృద్ధిపై ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రత్యేక దృష్టి సారించింది. నియోజకవర్గంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై పలుదపాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వివిధ శాఖల మంత్రులను కలిసి నియోజకవర్గ అభివృద్ధికై నిధులు మంజూరు చేయాలని డాక్టర్ లక్ష్మి కోరారు. అందులో భాగంగా నియోజకవర్గ అభివృద్ధికై నిధులు వరద పారుతుంది. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో ప్రధాన సమస్యలను గుర్తించి మొదటగా వాటికి నిధులు మంజూరు చేయించి సమస్యను పరిష్కరిస్తున్నారు డాక్టర్ లక్ష్మి. యాళ్ల తరబడి పరిష్కారం సమస్యకు డాక్టర్ లక్ష్మి పరిష్కారం చూపింది. కాశీపురం టు వెల్లంపల్లి రోడ్డుకు నిధులు మంజూరు చేయించింది. కురిచేడు మండలంలోని కాశీ పురం నుండి త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి వరకు కోటి85 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులను డాక్టర్ లక్ష్మీ ప్రారంభించింది. అదేవిధంగా ఆవుల మంద ,మిరియంపల్లి మధ్యలో గల గుండ్ల కమ్మ నదిపై బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. మార్కాపురం , ప్రకాశం జిల్లా మధ్య రాకపోకలకు మార్గం సుగమమయింది. ఏళ్ల తరబడి ప్రజల నిరక్షణకు తెరపడినట్లుంది. రవాణా వ్యవస్థ బాగుంటే అభివృద్ధికి దోహదపడుతుందని గ్రామస్తులు అంటున్నారు. వారంలో ఆరు రోజులు పాటు గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని డాక్టర్ లక్ష్మి పరిష్కరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యకు డాక్టర్ లక్ష్మి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే పరిష్కారం చూపారని ప్రజలు తెలిపారు.