BREAKING
జిల్లావ్యాప్తంగా రెండవ రోజు కొనసాగిన ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ – జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర చీరాలలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ సస్పెన్షన్తో సరిపెడతారా? ఎన్నికల సంఘానికి నివేదించరా? జగిత్యాలలో అక్రమంగా రోడ్డు తవ్వకాలు బీరు సీసాతో మెడ పై పొడిచి, దాడి - ఐదుగిరి పై కేసు- కమ్మర్ పల్లి ఎస్ఐ వత్సవాయి మండలంలో ప్రశాంతంగా పోలింగ్.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత నేడు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్.. నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు కలగొట్ల అభివృద్ధికి కృషి చేస్తా ● మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి ● సర్పంచ్ అభ్యర్థి చిట్రెడ్డి విమల సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు..

Select Suryaa Now
యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు..
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి  తెలంగాణ రాష్ట్రంలో యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో  మెదడు, వెన్నెముక సమస్యలకు అత్యాధునిక చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని యశోద సెంటర్ ఫర్ న్యూరోఎండోస్కోపీ అండ్​ రోబోటిక్ న్యూరోసర్జరీ వైద్యులు డా. కృష్ణ తేజ్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి యశోద హాస్పిటల్స్ బ్రాంచిలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్​లో తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​లో న్యూరోఎండోస్కోపీ, రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీ, అధునాతన ఇమేజింగ్ ద్వారా ఇన్వాసివ్ విధానంలో చికిత్సలు అందిస్తున్నామని కృష్ణ తేజ్ రెడ్డి వివరించారు. మెదడు కణితులకు ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ సహాయంతో శస్త్రచికిత్స సమయంలోనే కణితి తొలగించే విషయాన్ని అంచనా వేసి కీలక మెదడు భాగాలకు హాని కలగకుండా సురక్షితంగా తొలగిస్తున్నామని తెలిపారు. మందులకు లొంగని మూర్ఛవ్యాధికి రోబోటిక్ సహాయంతో సహా పలు శస్త్రచికిత్స ఎంపికలు తమ వద్ద ఉన్నాయన్నారు. 
తీవ్రమైన ముఖ నొప్పి అయిన ట్రైజెమినల్ న్యూరల్జియాకు ఎండోస్కోపిక్ మైక్రోవాస్కులర్ డికంప్రెషన్ ద్వారా దీర్ఘకాలిక ఉపశమనం కల్పిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు 110 కేసులను విజయవంతంగా చేశామని వెల్లడించారు. ప్రజల్లో అవగాహన కోసం అక్టోబర్ 7న ప్రపంచ ట్రైజెమినల్ న్యూరల్జియా దినోత్సవం రోజున ప్రత్యేక క్లినిక్​ను ప్రారంభించామని చెప్పారు. కామారెడ్డి, చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఈ అధునాతన సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కామారెడ్డి బ్రాంచ్ ఇన్​ఛార్జి శ్రీనివాస్ పాల్గొన్నారు.