telangana
వీణవంకలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలి
సూర్య, వీణవంక:వీణవంక మండల కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుడు పత్తి వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు వినతిపత్రం అందజేశారు. మండలంలో అవసరమైన వసతులు, రవాణా సౌకర్యాలు ఉన్నాయని, కళాశాల ఏర్పాటుతో గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని బల్మూరి వెంకట్ సానుకూలంగా స్పందించి హామీ ఇస్తూ, త్వరలోనే కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.