telangana
వాసవి క్లబ్ బిబిపేటలో ఉచిత వైద్య శిబిరం
సూర్య బీబీపేట్ : మండల కేంద్రం లో వాసవి క్లబ్ భవనంలో యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరము నిర్వహించారు. శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, పాల్మనాలజీ, కార్డియాలజీ సంబంధించిన స్పెషలిస్టులు వచ్చి దాదాపు 135 మందికి ఈసీజీ మరియు బీపీడీ మరియు రక్త పరీక్షలు నిర్వహించారు.తదుపరి రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీ నందన్ రావు, అఖిల్, సాయి రెడ్డి యశోద హాస్పిటల్స్ కామారెడ్డి ఇంచార్జ్ చందుపట్ల శ్రీనివాస్,వాసవి క్లబ్ బీబీపేట్ అధ్యక్షులు మురికి శ్రీనివాస్ కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్, కోశాధికారి జోర్రిగల శ్రీనివాస్, అంతర్జాతీయ వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్, తాటిపల్లి రమేష్, జోన్ చైర్మన్ నాగభూషణం, హరిప్రసాద్, పెద్ది నాగేశ్వర్, విశ్వ మోహన్ తదితరులు పాల్గొన్నారు.