BREAKING
మిట్స్ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్ సరాజు పి.మొహంతి నియామకం : నాణ్యమైన విద్య,ఉపాధి అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యమని వెల్లడి : శుభాకాంక్షలు తెలిపిన ఛాన్సల్లర్ ఎన్.విజయ్ భాస్కర్ చౌదరి సోమీదేవిపల్లి పంచాయతీలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక ఖమ్మం నగరంలో పలు వివాహ శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..* 2025–26లో 378.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాజ్యాంగంతోనే సమాన అవకాశాలు బ్రెజిల్ ఆర్థిక చర్యలపై లూలాతో ఆర్థిక మంత్రి భేటీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణం, ఆనందదాయకం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్* ఇంకొల్లు మండలంలో సర్పంచ్‌లు వీరే మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు జీడీపీ డేటాపై ట్రంప్ సంచలన ఆరోపణలు రష్యా రాయబారితో చర్చల ప్రణాళికపై జర్మనీ ఏఎఫ్‌డీ సహ-అధ్యక్షుడి విమర్శలు ఫ్రాన్స్‌లో పెరుగుతున్న సమస్యలు.. అధ్యక్ష రేసులో పోటెత్తుతున్న అభ్యర్థులు కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ విద్యుదీకరణ లక్ష్యంపై దేశాలు, సంస్థల సమైక్య ముందడుగు 2025–26లో 253.81 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి మంగళగిరిలో మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు బిజీబిజీ : ఎన్నికల సరళిని పరిశీలించిన తెలుగు యువత రథసారధి

రైతులకు, వ్యాపారస్తులకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విస్తృత రుణ పథకాలు.

Select Suryaa Now
రైతులకు, వ్యాపారస్తులకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విస్తృత రుణ పథకాలు.

**కళ్యాణదుర్గం:** రైతులు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో వివిధ రకాల రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయని విజయవాడ సర్కిల్ డీజీఎం, సర్కిల్ హెడ్ కవితా ఫ్రాంక్ తెలిపారు. బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 84వ శాఖను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ దైవప్రసాద్ రిబ్బన్ కట్ చేసి నూతన బ్యాంకు శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా కవితా ఫ్రాంక్ మాట్లాడుతూ.. స్టేట్ బ్యాంక్ తరహాలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రతి బజారులో, ప్రతి ఇంటిలో ప్రజలకు సుపరిచితమైన బ్యాంకుగా గుర్తింపు పొందాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఖాతాదారులకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా సేవలను విస్తరిస్తామని వెల్లడించారు. నూతన శాఖ ఏర్పాటుతో స్థానిక ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువవుతాయని తెలిపారు. వ్యవసాయాధారిత ప్రాంతమైన కళ్యాణదుర్గంలో రైతుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పంట రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. ఎకరాకు సుమారు రూ.లక్ష చొప్పున పంట రుణం పొందే అవకాశం ఉందని, అర్హత, సిబిల్ స్కోరు తదితర నిబంధనల ఆధారంగా భూమి విలువలో 50 శాతం వరకు అదనపు రుణ సదుపాయం కల్పించే అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయంతో పాటు పౌల్ట్రీ, పశుపోషణ వంటి అనుబంధ రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి కూడా బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అలాగే సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు గృహ రుణాలను పోటీ వడ్డీ రేట్లతో త్వరితగతిన మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు అర్హతను బట్టి రుణాలు అందించే అవకాశం ఉందన్నారు. బంగారు రుణాలతో పాటు వివిధ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక రుణ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. విద్యార్థులకు విద్యా రుణాలు, ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు అందించడం ద్వారా ఆర్థికంగా అండగా నిలుస్తామని చెప్పారు. బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగంt చేసుకోవాలని కోరారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో వ్యాపార, వ్యవసాయ రంగాల అభివృద్ధికి పీఎన్‌బీ శాఖ కీలకంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఖాతాదారుల విశ్వాసాన్ని పొందేందుకు బ్యాంకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఏజీఎం ఎల్.రామనాథన్, ఏఐపీఎన్‌బీఓఏ జనరల్ సెక్రటరీ పి.నారాయణ, అధ్యక్షుడు షేక్ గౌస్, ఏఐపీఎన్‌బీఈయూ ఏజీఎస్ శ్రీకాంత్, కళ్యాణదుర్గం బ్రాంచ్ మేనేజర్ మధులత, బ్యాంకు అధికారి కిరణ్ కుమార్, కోమలి తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.