BREAKING
ఇంకొల్లు మండలంలో సర్పంచ్‌లు వీరే మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు జీడీపీ డేటాపై ట్రంప్ సంచలన ఆరోపణలు రష్యా రాయబారితో చర్చల ప్రణాళికపై జర్మనీ ఏఎఫ్‌డీ సహ-అధ్యక్షుడి విమర్శలు ఫ్రాన్స్‌లో పెరుగుతున్న సమస్యలు.. అధ్యక్ష రేసులో పోటెత్తుతున్న అభ్యర్థులు కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ విద్యుదీకరణ లక్ష్యంపై దేశాలు, సంస్థల సమైక్య ముందడుగు 2025–26లో 253.81 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి మంగళగిరిలో మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు బిజీబిజీ : ఎన్నికల సరళిని పరిశీలించిన తెలుగు యువత రథసారధి ఐఐటీఎఫ్ 2026లో ఆయుష్ పెవిలియన్ సందడి సాగర్ నుంచి ప్రపంచ వేదికపైకి.. హైదారాబాద్ యాచ్ క్లబ్‌కు ప్రతిష్ఠాత్మక వరల్డ్ సెయిలింగ్ ఇంపాక్ట్ అవార్డు! మాజీ లోక్‌సభ స్పీకర్ రబీ రే జయంతి 2029 తర్వాత డ్రగ్స్ సరఫరా చేస్తే అమీర్‌పేట్ చౌరస్తాలో పాతరేస్తాం.. రాజ్యాంగ దినోత్సవం వేళ 22 భాషల్లో నవీకరించిన భారత రాజ్యాంగం ఆవిష్కరణ అమెరికా విమాన సుంకాలతో విమానయాన సంస్థలకే నష్టం పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పడావు పెట్టారు..

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా: మండల ప్రజా ప్రతినిధులు

Select Suryaa Now
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా: మండల ప్రజా ప్రతినిధులు

కుల్కచర్ల, మేజర్ న్యూస్: ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని ప్రజాప్రతినిధులు తెలిపారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలో ప్రతి కుటుంబానికి ఒక భరోసా – కుటుంబానికి జీవిత బీమా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అంజిలయ్య, పీఏసీఎస్ చైర్మన్ బొలుసాని భీమ్ రెడ్డి, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ బీఎస్ ఆంజనేయులు, మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కుటుంబాన్ని పోషించే ప్రధాన వ్యక్తి అనుకోని కారణాలతో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా నామినీకి రూ.5 లక్షల బీమా పరిహారం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ పథకంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అర్హులైన వారందరూ నమోదు చేసుకుని ప్రభుత్వం కల్పిస్తున్న బీమా భరోసాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకుడు కుమ్మరి స్వామి, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గౌడ్, నాయకులు కడుమూరి రాంరెడ్డి, తమ్మలి రామచంద్రయ్య, చెలిమిళ్ల ఆనందం, కర్రె వినోద్ కుమార్, మోత్కూరు వెంకటేష్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొమ్ము శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఎల్. నర్సింలు, నాగని ఎల్లయ్య, ఊరడి చంద్రయ్య, ఎదుల సంతోష్, తుప్పలి వెంకట్ రాములు, బోయిని కృష్ణయ్య, భాను, శావుకు ముకుంద, నాగని మురళి తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.