స్థూల విలువ జోడింపు (GVA) పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*
కర్నూలు, నవంబర్ 25:- స్థూల విలువ జోడింపు (Gross Value Added – GVA) పెంపునకు రవాణా, మైన్స్ రంగంలో మరింత అభివృద్ధి సాధించే దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లో కీలక పనితీరు సూచికలు, లక్ష్యాల సాధన పురోగతి, స్థూల విలువ జోడింపు (GVA) పురోగతి పై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు రవాణా రంగంలో స్థూల విలువ జోడింపు (GVA) పెంపునకు దోహదపడే ప్రధాన వృద్ధి కారకాలను గుర్తించి సంబంధిత అంశాలను సమగ్రంగా విశ్లేషించి నివేదిక రూపొందించాలని కలెక్టర్ డిటిసి ని ఆదేశించారు... 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాల సాధనలో పురోగతిని మరింత మెరుగుపరచాలని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే సాధించిన వృద్ధిని కొనసాగిస్తూ స్థూల విలువ జోడింపు (GVA) లక్ష్యాలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా లక్ష్యాల సాధనలో ఇంకా ఉన్న అంతరాలను గుర్తించి, వాటికి గల కారణాలను స్పష్టంగా నివేదికలో పొందుపరచాలన్నారు. రాబోయే కాలంలో స్థూల విలువ జోడింపు (GVA) మరింత పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రంగంలోని అభివృద్ధి అవకాశాలు, అమలు చేయదగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు.
హౌసింగ్ కార్యక్రమం అమలులో భాగంగా గృహ నిర్మాణాల్లో పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడానికి గల కారణాలను విశ్లేషించాలని కలెక్టర్ హౌసింగ్ పిడి ని ఆదేశించారు.. ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు లబ్ధిదారులు బాగా వినియోగించుకొని ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.. అదే విధంగా ఐహెచ్ఎస్‌ఎస్ కి సంబంధించి సెప్టెంబర్ 2026 వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అంశాన్ని నివేదికలో పొందుపరచాలని, పెండింగ్ బిల్లుల చెల్లింపులు పూర్తయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
గనుల శాఖకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఇప్పటికే 100 శాతం సాధించినప్పటికీ, ఖనిజాల వారీగా నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) లో రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ ఖనిజాల పనితీరు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రధాన ఖనిజాల పనితీరు బీ-గ్రేడ్‌లో ఉందని, వాటికి సంబంధించి మిగిలిన లక్ష్యాలను డిసెంబర్ నెలలోగా సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గనుల శాఖ డిడి ని ఆదేశించారు..