BREAKING
గ్రామ పంచాయతీ ఎన్నికల లో ఓటు హక్కు వినోయోగించుకొనే ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నందమూరి తేజస్విని తొలి నిర్మాణ చిత్రం షూటింగ్ ప్రారంభం.. హీరో ఎవరంటే స్పెయిన్ కానరీ దీవులకు ఒకే రోజులో 2,100 మందికి పైగా వలసదారులు.. ఆల్-టైమ్ రికార్డు!: కలెక్టరేట్ గ్రంథాలయానికి 50 పుస్తకాలు విరాళం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన భూమా కిషోర్ రెడ్డి కుర్దిస్థాన్ సరిహద్దుల్లో ఇరాక్ సైన్యానికి అధికారాలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు: ఊటీ మైనపు బొమ్మల మ్యూజియంలో సీఎం విజయ్ విగ్రహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిప్యూటీ మేయర్ టి. స్వాతి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను మరియు బాపట్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి బ్రిటన్ మార్కెట్లో రక్షణాత్మక రంగాల కొనుగోళ్లు.. ఎఫ్‌టీఎస్‌ఈ 100 (FTSE 100) లాభాల్లో: హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల జోరు.. అక్కిసాని వనజమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం! సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీని కలసిన జడ్పి చైర్ పర్సన్ శైలజ తేజో మూర్తి వరుణ్ సందేశ్ 'యద్భావం తద్భవతి' రిలీజ్ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఖరారు నిర్మాణ పరికరాల తయారీకి కేంద్రం రూ. 11,000 కోట్ల ప్రోత్సాహక పథకం: మోదీ కేబినెట్ కీలక ఆమోదం..

కూటమి ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం బలోపేతం టీడీపీ నేత ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ

Select Suryaa Now
కూటమి ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం బలోపేతం టీడీపీ నేత ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ

అమరావతి, మేర్‌న్యూస్‌ :

గత పాలనలో పంచాయతీ నిధుల దుర్వినియోగం, రోడ్ల నిర్లక్ష్యం, సర్పంచుల అధికారాల క్షీణత కారణంగా గ్రామీణ ప్రాంతాలు తిరోగమనం పాలయ్యాయని టీడీపీ నేత ఎస్. వీ.ఎస్ వర్మ అన్నారు. బుధవారం, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  కూటమి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని బలపరుస్తూ అవసరమైన నిధులు, అధికారాలు, మౌలిక సదుపాయాలు అందిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో రూ.9వేల కోట్ల పంచాయతీ నిధులు దారిమళ్లించారు. కనీసం గ్రామపంచాయతీల కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి తీసుకొచ్చారు. వైసీపీ పాలనలో 15 ఆర్ధిక సంఘం  నిధులు పెండింగ్ పెట్టారు. కూటమి ప్రభుత్వంలో ఆర్ధిక సంఘం నిధులు రూ.4,200 నేరుగా పంచాయతీలకు జమ చేసి గ్రామ స్థాయి అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

గ్రామీణ రహదారుల అభివృద్ధి  
గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, పరిశుభ్రత, ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గ్రామానికి గ్రామానికి అనుసంధానం, గ్రామ లోపల సంపర్క రోడ్లు, గర్భిణీ స్త్రీలు, విద్యార్థులు, రైతులు, వృద్ధులకు సురక్షిత ప్రయాణ సౌకర్యం అందించడం జరుగుతోంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ‘అడవి తల్లి బాట’ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో రహదారులు వేయడం జరుగుతోంది.

పరిశుభ్రత & పబ్లిక్ ఆరోగ్యం  
గ్రామాల్లో చెత్త నిర్వహణ, డ్రైనేజీ శుభ్రత, సానిటేషన్ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటువ్యాధులు నియంత్రించడం, చెత్త పేరుకుపోకుండా చూడటం, పర్యావరణ పరిశుభ్రత కాపాడటం ద్వారా ఆరోగ్యకరమైన గ్రామాలను ఏర్పాటు చేయడమే లక్ష్యం. ‘స్వచ్ఛాంధ్రప్రదేశ్’ కార్యక్రమాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యకలాపాలు నిరంతరం నిర్వహిస్తున్నారు.

ఉపాధి హామీ పథకం  
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంతోపాటు, చెక్ డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, కాలువ శుద్ధి, వ్యవసాయ సంబంధ పనులు చేపట్టడం జరుగుతోంది. పని దినాలు 125 రోజులకు పెంచి వేతనాలు సకాలంలో పారదర్శకంగా ప్రాధాన్యత ఇస్తోంది. ఇది పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత, వ్యవసాయ మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

వ్యవసాయం & సాగునీరు  
ధాన్యం కొనుగోలు లో రైతులుకు 24గంటల్లో డబ్బులు రైతుల ఖాతాలల్లో జమ చేయడం జరుగుతోంది.గత ప్రభుత్వంలో రైతులకు సకాలంలో డబ్బులు జమ అయిన పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, ఎత్తిపోతల ద్వారా నీటి ప్రవాహం, 36 సాగునీటి ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం కూటమి ప్రభుత్వం లక్ష్యం.
విద్యా రంగ అభివృద్ధి
గ్రామీణ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు,  మెగా డీఎస్సీ ద్వారా 1650  ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చాం. పాఠశాలల్లో పిల్లల సౌకర్యాలు, యూనిఫారం, బ్యాగ్, షూ వంటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పేరెంట్స్–టీచర్ మీటింగ్స్ ద్వారా పిల్లల పురోగతిని తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. 
ప్రజల సహకారం అవసరం  
గ్రామీణ ప్రగతిని మరింత వేగవంతం చేయడానికి ప్రజల సహకారం అవసరం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి దృష్టితో ఓటు వేయాలని, గ్రామ స్వరాజ్యాన్ని బలపరిచే నాయకులకు అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతోనే గ్రామాల్లో శాశ్వత అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజా సేవ, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అంకితమై ఉందన్నారు.