BREAKING
తాండూరు క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల విధులను పి ఓ లు బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ 8 కేజీల గజ్జెలతో శ్రద్ధా కపూర్ కఠిన సాధన.. గాయమైనా వెనకడుగు వేయని నటి విద్యార్థుల భవిష్యత్తుకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం: చామకూర మల్లారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ధర్మతేజ. ఐదు రోజులుగా అదృశ్యమైన యువకుడు బావిలో మృతదేహంగా లభ్యం గ్రామ పంచాయతీ ఎన్నికల లో ఓటు హక్కు వినోయోగించుకొనే ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నందమూరి తేజస్విని తొలి నిర్మాణ చిత్రం షూటింగ్ ప్రారంభం.. హీరో ఎవరంటే స్పెయిన్ కానరీ దీవులకు ఒకే రోజులో 2,100 మందికి పైగా వలసదారులు.. ఆల్-టైమ్ రికార్డు!: కలెక్టరేట్ గ్రంథాలయానికి 50 పుస్తకాలు విరాళం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన భూమా కిషోర్ రెడ్డి కుర్దిస్థాన్ సరిహద్దుల్లో ఇరాక్ సైన్యానికి అధికారాలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు: ఊటీ మైనపు బొమ్మల మ్యూజియంలో సీఎం విజయ్ విగ్రహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిప్యూటీ మేయర్ టి. స్వాతి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను మరియు బాపట్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

తీర్థప్రసాదాలు స్వీకరించని జగన్మోహన్ రెడ్డికి రాముడి పేరు పలికే అర్హత లేదు – ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు

Select Suryaa Now
తీర్థప్రసాదాలు స్వీకరించని జగన్మోహన్ రెడ్డికి రాముడి పేరు పలికే అర్హత లేదు   – ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు

మంగళగిరి, మేజర్‌న్యూస్‌ :

 కేవలం రాజకీయ స్వార్థం కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతూ, సాక్షి పత్రికను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఆంజనేయపురంలోని ఆంజనేయ స్వామి ఆలయ తరలింపు వ్యవహారంలో వాస్తవాలను దాచిపెట్టి, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ రహదారి (NH-716) నిర్మాణ అవసరాల కోసం 2023లో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆనాడు స్థానిక ఎమ్మెల్యేగా, టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ తరలింపునకు నిర్ణయం తీసుకొని, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి ద్వారా భూసేకరణ అవార్డు కేటాయించారని స్పష్టం చేశారు. కనీసం ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించకుండా, నేడు ఏమీ తెలియనట్లు అబద్ధాలతో రాజకీయ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సనాతన ధర్మాన్ని, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆంజనేయపురం గ్రామస్తులు, ఆలయ అర్చకుల సమక్షంలో ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం అత్యంత భక్తిశ్రద్ధలతో విగ్రహాన్ని తాత్కాలిక ఆలయంలోకి తరలించి ప్రతిష్ఠించామని గద్దె రామ్మోహన్ రావు వివరించారు. గత ప్రభుత్వం గాలికొదిలేసిన ఆలయ నిర్మాణానికి రూ. 59 లక్షలకు పైగా నిధులను మంజూరు చేసి ఆలయ ఖాతాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించామని, గ్రామస్తులు, పూజారులు ఎంతో సంతోషంగా నూతన ఆలయ నిర్మాణ పనులు చేసుకుంటున్నారని తెలిపారు. ఇది 70 ఏళ్ల క్రితం గ్రామస్తులు ప్రతిష్ఠించుకున్న ఆలయమే తప్ప స్వయంభువు విగ్రహం కాదని, అభివృద్ధి పనుల కోసం అందరి అంగీకారంతోనే తరలింపు జరిగిందని స్పష్టం చేశారు. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి రోజుకు 50 వేల మంది, వారాంతాల్లో లక్ష మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం కొన్ని నిర్మాణాలు తొలగిస్తే, నాడు కూడా గుడులు కూల్చేశారంటూ వైసీపీ నేతలు ఇదే తరహాలో విషం చిమ్మారని గుర్తుచేశారు.

గత వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 300కు పైగా దేవాలయాలపై దాడులు జరిగితే ఏనాడూ 'హే రామ్' అని పలకని జగన్మోహన్ రెడ్డికి నేడు కొత్తగా రాముడు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని రామ్మోహన్ రావు ఎద్దేవా చేశారు. నాడు రామతీర్థంలో రాములవారి విగ్రహం తల నరికితే "ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా" అని, అంతర్వేది రథం తగలబడితే "కొత్త రథం చేయించుకోవచ్చు కదా" అని వైసీపీ నేతలు అహంకారపూరితంగా మాట్లాడారే తప్ప ఒక్క ఆలయాన్ని కూడా జగన్ సందర్శించలేదని మండిపడ్డారు. అర్చకులు ఇచ్చిన తీర్థాన్ని తాగకుండా కింద పారబోయడం, దేవుడి ప్రసాదాన్ని ఇంటి లోపలికి రానివ్వకపోవడం, తిరుమల బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం చేయడం, కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని 'నల్లరాయి, చెప్పుతో కొట్టినా తప్పేంటి' అని అవమానించిన వ్యక్తులను టీటీడీ ఛైర్మన్లుగా నియమించిన పాపం వైసీపీదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవాలయాలపై జరిగిన అపచారాల వల్లే 2024 ఎన్నికల్లో ఆ రాములవారు వైసీపీకి కనీవినీ ఎరుగని రీతిలో ఘోర పరాజయాన్ని కట్టబెట్టారని గద్దె రామ్మోహన్ రావు వ్యాఖ్యానించారు. హిందూ, క్రైస్తవ, ఇస్లాం సహా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వైసీపీ నేతల అబద్ధాలు, దౌర్జన్యాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మే స్థితిలో లేరని, తప్పుడు ప్రచారాలు చేసే కొద్దీ ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొట్టే నీచ రాజకీయాలు మానుకొని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని గద్దె రామ్మోహన్ రావు హితవు పలికారు.