BREAKING
2025–26లో 378.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాజ్యాంగంతోనే సమాన అవకాశాలు బ్రెజిల్ ఆర్థిక చర్యలపై లూలాతో ఆర్థిక మంత్రి భేటీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణం, ఆనందదాయకం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్* ఇంకొల్లు మండలంలో సర్పంచ్‌లు వీరే మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు జీడీపీ డేటాపై ట్రంప్ సంచలన ఆరోపణలు రష్యా రాయబారితో చర్చల ప్రణాళికపై జర్మనీ ఏఎఫ్‌డీ సహ-అధ్యక్షుడి విమర్శలు ఫ్రాన్స్‌లో పెరుగుతున్న సమస్యలు.. అధ్యక్ష రేసులో పోటెత్తుతున్న అభ్యర్థులు కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ విద్యుదీకరణ లక్ష్యంపై దేశాలు, సంస్థల సమైక్య ముందడుగు 2025–26లో 253.81 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి మంగళగిరిలో మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు బిజీబిజీ : ఎన్నికల సరళిని పరిశీలించిన తెలుగు యువత రథసారధి ఐఐటీఎఫ్ 2026లో ఆయుష్ పెవిలియన్ సందడి సాగర్ నుంచి ప్రపంచ వేదికపైకి.. హైదారాబాద్ యాచ్ క్లబ్‌కు ప్రతిష్ఠాత్మక వరల్డ్ సెయిలింగ్ ఇంపాక్ట్ అవార్డు! మాజీ లోక్‌సభ స్పీకర్ రబీ రే జయంతి

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: ఎంసీపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: ఎంసీపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్

శామీర్‌పేట, మేజర్ న్యూస్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మూడుచింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ అన్నారు. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ 8వ వార్డుకు చెందిన జూపల్లి రేణుక, భాస్కర్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 8వ వార్డు కౌన్సిలర్ దోసకాయల లత వెంకటేష్, 21వ వార్డు కౌన్సిలర్ రాజిగల్ల లత భూపాల్‌తో కలిసి రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించి లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దోసకాయల వెంకటేష్ మాట్లాడుతూ.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సహకారంతో మున్సిపాలిటీలో అర్హులైన పేదలకు అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పట్ట బాల నరసింహ, 9వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల నాగేష్, నాయకులు తుంకి వెంకటేశం, నల్ల ప్రభాకర్ రెడ్డి, ఏటావళి లక్ష్మణ్, ఏటావళి బిక్షపతి, జూపల్లి రేణుక కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.