శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ భయం
శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్, అభ్యర్థులలో గుబులు, శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్, వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ఏ పార్టీ ఎవరిని ముంచు తుందో, తెలియని పరిస్థితి ఏర్పడింది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో 41 వార్డులు, 88 పోలింగ్ కేంద్రాల్లో నవంబర్ 26 వ తేదీ ఎన్నికల నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక పార్టీ తరఫున పోటీ చేసే కౌన్సిలర్లు అదే పార్టీ మద్దతుదారులు తమ సొంత పార్టీ అభ్యర్థికి కాకుండా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారనే భయం అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గతంలో వార్డు కౌన్సిలర్ గా గెలిచిన వారిని వార్డు సభ్యులు అందరూ కలిసి చైర్మన్ ను ఎన్నుకునేవారు. అయితే కూటమి ప్రభుత్వం ప్రత్యక్ష ఎన్నికల పునరుద్ధరణ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 ఆగస్టులో మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు ద్వారా మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానాన్ని తిరిగి తీసుకువచ్చింది. గతంలో 2005 నుండి వార్డు కౌన్సిలర్లు పరోక్ష పద్ధతిలో చైర్మన్‌ను ఎన్నుకునేవారు. ఈ విధానానికి కూటమి ప్రభుత్వం స్వప్తి పలికింది. దీంతో మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లుకు ఓటర్ల స్థాయిలో క్రాస్ ఓటింగ్ భయాలు నెలకొని ఉన్నాయి. నవంబర్ 26 తేదీ జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వార్డు కౌన్సిలర్‌కు ఒక ఓటు, మున్సిపల్ చైర్మన్‌కు మరొక ఓటు వేయనున్నారు. ఉదాహరణకు శ్రీకాళహస్తి మున్సిపాలిటీలలో ఒక పార్టీ వార్డు అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలు, చైర్మన్ పదవికి మరో పార్టీ అభ్యర్థికి ఓటు వేయడంతో ఓటర్ల స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు వ్యక్తం అవుతున్నాయి.
వివిధ పార్టీలు తరఫున పోటీ చేసే వార్డ్ కౌన్సిలర్లు వారి వారి సొంత ఇమేజ్ తో కొన్ని వార్డుల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. వారి ప్రభావం చైర్మన్ కు ఓటు వేసేటప్పుడు చూపకపోవచ్చు. వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థులు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కూడా ఓటు వేయాలని తప్పకుండా ప్రచారం చేసుకోవలసి ఉంది. మనకెందుకులే మన వార్డు మనం గెలుచుకుంటే చాలు అని కౌన్సిలర్ అభ్యర్థులు భావిస్తే, చైర్మన్ అభ్యర్థికి వేసే ఓట్లు గల్లంతే కావడం కనిపిస్తున్నది. ఒక ఓటు వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి, మరో ఓటు ప్రతిపక్ష పార్టీ చైర్మన్ అభ్యర్థికి ఓటు వేస్తే క్రాస్ ఓటింగ్ ప్రభావంతో చైర్మన్ సీటు గల్లంతయి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికలు విజయం ఎవరిని వివరించిన ఉందో వేచి చూడాల్సిందే. శ్రీకాళహస్తి పట్టణంలో కూటమి అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు నుండి విత్ డ్రా వరకు ఆనందంతో ఊగిపోయారు. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అందరినీ ఏకగ్రీవం చేస్తారు అని అనుకున్నారు. అది జరగకపోవడంతో పలు ఇబ్బందులకు గురవుతూ, నానా ఇబ్బందులు పడుతున్నారు. మేమేదో ఊరికే నామినేషన్ వేస్తే మమ్మలను అప్పులు పాలు చేస్తున్నారని ఆవేదన చెందుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. చైర్మన్ ఓటు మనకెందుకులే అనుకుని వార్డు ఓటు మాత్రమే అడుగుతూ ఉన్నారు. వైయస్సార్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నిటికీ సిద్ధపడి ప్రచారాలు చేస్తూ అభ్యర్థులకు దిశనిద్దేశం చేసి ముందుకు పంపడం జరిగింది. అధికార పార్టీలో అది లేదని కూటమి నేతలు బహిరంగంగా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మార బోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి