BREAKING
స్పెయిన్ కానరీ దీవులకు ఒకే రోజులో 2,100 మందికి పైగా వలసదారులు.. ఆల్-టైమ్ రికార్డు!: కలెక్టరేట్ గ్రంథాలయానికి 50 పుస్తకాలు విరాళం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన భూమా కిషోర్ రెడ్డి కుర్దిస్థాన్ సరిహద్దుల్లో ఇరాక్ సైన్యానికి అధికారాలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు: ఊటీ మైనపు బొమ్మల మ్యూజియంలో సీఎం విజయ్ విగ్రహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిప్యూటీ మేయర్ టి. స్వాతి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను మరియు బాపట్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి బ్రిటన్ మార్కెట్లో రక్షణాత్మక రంగాల కొనుగోళ్లు.. ఎఫ్‌టీఎస్‌ఈ 100 (FTSE 100) లాభాల్లో: హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల జోరు.. అక్కిసాని వనజమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం! సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీని కలసిన జడ్పి చైర్ పర్సన్ శైలజ తేజో మూర్తి వరుణ్ సందేశ్ 'యద్భావం తద్భవతి' రిలీజ్ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఖరారు నిర్మాణ పరికరాల తయారీకి కేంద్రం రూ. 11,000 కోట్ల ప్రోత్సాహక పథకం: మోదీ కేబినెట్ కీలక ఆమోదం.. కె. బి. పాలెం గ్రామం, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల లో 1 వార్డు కు సంబంధించి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి తండ్రి విజయం కోసం యువ డాక్టర్ ప్రచారం.

గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Select Suryaa Now
గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం


ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో 77 పంచాయతీలకు గురువారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసు అధికారులు కూడా సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరిగే గ్రామాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున బలగాలను మొహరింప చేశారు.   నియోజకవర్గంలో 6 మండలాల్లో 104 పంచాయతీలు ఉండగా నామపత్రాల ఉపసంహరణ తర్వాత 27  పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 77 గ్రామపంచాయతీలో ఎన్నికలు జరగనున్నాయి.  ఆళ్లగడ్డ మండలంలో 17 పంచాయతీలు ఉండగా మూడు పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 14 పంచాయతీలకు సంబంధించి  31 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. దొర్నిపాడులో 11 గ్రామపంచాయతీలకు గాను 6 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 5 పంచాయతీలో పోటీ నెలకొంది. 13 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. రుద్రవరం మండలంలో 21 గ్రామపంచాయతీలకు గాను గంగుల కుటుంబం సొంతూరు యర్రగుడిదిన్నె మాత్రమే ఏకగ్రీవమైంది. మిగిలిన 20 గ్రామపంచాయతీలకు సంబంధించి  52 మంది పోటీలో ఉన్నారు. చాగలమర్రిలో 19 పంచాయతీలు ఉండగా 4 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 15 పంచాయతీలకు సంబంధించి  39 మంది పోటీలో ఉన్నారు. శిరివెళ్ల మండలంలో 16 పంచాయతీలకు గాను మూడు పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 13 పంచాయతీలకు సంబంధించి 39 మంది పోటీలో ఉన్నారు.  ఉయ్యాలవాడ మండలంలో 20 పంచాయతీల్లో పది ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పది పంచాయతీలకు సంబంధించి 31 మంది సర్పంచ్  అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చాగలమర్రి గ్రామపంచాయతీ లో జరిగే ఎన్నికలను వైకాపా బలపరిచిన అభ్యర్థులు బహిష్కరించారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా