BREAKING
గ్రామ పంచాయతీ ఎన్నికల లో ఓటు హక్కు వినోయోగించుకొనే ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నందమూరి తేజస్విని తొలి నిర్మాణ చిత్రం షూటింగ్ ప్రారంభం.. హీరో ఎవరంటే స్పెయిన్ కానరీ దీవులకు ఒకే రోజులో 2,100 మందికి పైగా వలసదారులు.. ఆల్-టైమ్ రికార్డు!: కలెక్టరేట్ గ్రంథాలయానికి 50 పుస్తకాలు విరాళం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన భూమా కిషోర్ రెడ్డి కుర్దిస్థాన్ సరిహద్దుల్లో ఇరాక్ సైన్యానికి అధికారాలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు: ఊటీ మైనపు బొమ్మల మ్యూజియంలో సీఎం విజయ్ విగ్రహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిప్యూటీ మేయర్ టి. స్వాతి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను మరియు బాపట్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి బ్రిటన్ మార్కెట్లో రక్షణాత్మక రంగాల కొనుగోళ్లు.. ఎఫ్‌టీఎస్‌ఈ 100 (FTSE 100) లాభాల్లో: హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల జోరు.. అక్కిసాని వనజమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం! సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీని కలసిన జడ్పి చైర్ పర్సన్ శైలజ తేజో మూర్తి వరుణ్ సందేశ్ 'యద్భావం తద్భవతి' రిలీజ్ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఖరారు నిర్మాణ పరికరాల తయారీకి కేంద్రం రూ. 11,000 కోట్ల ప్రోత్సాహక పథకం: మోదీ కేబినెట్ కీలక ఆమోదం..

తండ్రి విజయం కోసం యువ డాక్టర్ ప్రచారం.

Select Suryaa Now
తండ్రి విజయం కోసం యువ డాక్టర్ ప్రచారం.

తండ్రి విజయం కోసం యువ డాక్టర్ ప్రచారం.

సూర్య న్యూస్ ముండ్లమూరు. తండ్రి విజయం కోసం యువ డాక్టర్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తూ తన తండ్రికి ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. మండలంలోని శంకరాపురం గ్రామంలో టిడిపి మద్దతుతో మందలపు పూర్ణచంద్రరావు సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన కుమారుడు డాక్టర్ సిద్ధార్థ మందలపు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. తన తండ్రిని సర్పంచ్ గా గెలిపిస్తే ఉచితంగా వైద్య సేవలు అందించడంతోపాటు గ్రామంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల పారదర్శకతో అమలు చేస్తానని 
రాష్ట్ర ప్రభుత్వం అందించే సూపర్ సిక్స్  పథకాలు తల్లికి వందనం, దీపం ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అన్నదాత సుఖీభవ అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా అందేలా పూర్తి బాధ్యత తీసుకుంటానని పూర్ణచంద్రరావు అన్నారు. రైతులకు అండగా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని,
పంట పొలాలకు వెళ్లే దారుల డొంక రోడ్ల మరమ్మత్తు, రైతులకు సకాలంలో ఎరువులు,విత్తనాలు అందేలా కృషి. యువత కోసం  లైబ్రరీ , స్టడీ సెంటర్  క్రీడా మైదానం అభివృద్ధి చేస్తానని అన్నారు. మంచం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని మందలపు పూర్ణచంద్రరావు ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ  మందలపు వెంకట్రావు మాజీ సర్పంచ్ కూరపాటి నారాయణస్వామి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.