ఎదులాబాద్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కప్పరగళ్ళ ఆంజనేయులు
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: ఎదులాబాద్ డివిజన్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కప్పరగళ్ల ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు ఎంపీ ఈటల రాజేందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మండల బీజేపీ అధ్యక్షుడు బసవరాజు, సీనియర్ నాయకులు గుండ్ల బాలరాజు, ఊదరి కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.