కాల్వ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి.. ఉయ్యాలడ షాకురున్ బీ
కాల్వ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి.. షాకురున్ బీ విజ్ఞప్తి!
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
మండ పరిధిలన కాల్వ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఉయ్యాలవాడ షాకురున్ బీ (రజాక్ భాష భార్య) ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామంలోని వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారుఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం కల్పిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో విజయం సాధించి కాల్వ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.